దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. ఇక ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో మార్చి 25న రిలీజ్‌కానున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. కాగా తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా భారత్‌లోని అతిపెద్ద థియేట్రికల్ ఎగ్జిబిటర్ పీవీఆర్ తొలిసారిగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో బ్లాక్‌చైయిన్ టెక్నాలజీను అందిపుచ్చుకుంది.
ఆర్‌ఆర్‌ఆర్ ఎన్‌ఎఫ్‌టీ..!
తొలిసారిగా భారతీయ సినీ ప్రేక్షకులకు ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ఎన్‌ఎఫ్‌టీ(నాన్ ఫంజిబుల్ టోకెన్స్) కలెక్షన్లను గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పీవీఆర్ ప్రకటించింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్, పీవీఆర్ సంయుక్తంగా ఈ డిజిటల్ ఎన్‌ఎఫ్‌టీలను ప్రేక్షకులకు అందుబాటులో ఉంచనుంది. ఎస్‌ఎస్ రాజమాళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అలియా భట్ సంతకం చేసిన పోస్టర్లు, సినిమాలో వాడిన పలు వస్తువులతో సహా దాదాపు 300పైగా ఎన్‌ఎఫ్‌టీలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ డిజిటల్ కలెక్షన్లను పీవీఆర్ నిర్వహించే పోటిలో వీటిని ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చునని పీవీఆర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా పాత చిత్రాలను కూడా ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్ల రూపంలో అందించేందుకు సిద్దమని పీవీఆర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజిలీ చెప్పారు.
పీవీ‘ఆర్‌ఆర్‌ఆర్’..!
గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో అతి పెద్ద మల్టీప్లెక్స్ చైన్ సిస్టమ్ పీవీఆర్ డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. పీవీఆర్ సినిమాస్‌కి సంబంధించిన అన్ని మల్టీప్లెక్స్‌ల పేరు PVRRR గా మార్చేశారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలయ్యే వరకు PVR సినిమాస్ PVRRR గా కనిపిస్తోందని ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియన్ సినిమా హిస్టరీ ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇలాంటి డీల్ ను సెట్ చేయలేదు.
చదవండి: టిక్కెట్ రేట్ల పెంపే కాదు ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కి మరో శుభవార్త!
Comments
Please login to add a commentAdd a comment