డంకీ సినిమా రిలీజ్.. సలార్ మేకర్స్ సంచలన నిర్ణయం! | Salaar makers to withdraw from PVR, Miraj in south after Dunki gets screens | Sakshi
Sakshi News home page

Salaar: సలార్‌ మేకర్స్ షాకింగ్ డెసిషన్.. ఆ థియేటర్లకు మాత్రమే!

Published Wed, Dec 20 2023 9:16 PM | Last Updated on Thu, Dec 21 2023 9:33 AM

Salaar makers to withdraw from PVR Miraj in south after Dunki gets Screens - Sakshi

మరికొద్ది గంటల్లో షారుక్ ఖాన్ నటించిన డంకీ థియేటర్లలో సందడి చేయనుంది. రాజ్‌కుమార్ ‍హిరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. నలుగురు వ్యక్తులు అక్రమంగా విదేశాలకు వెళ్తే ఏమవుతుంది అనే కథాంశంతో డంకీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఏడాది పఠాన్, జవాన్ చిత్రాలతో వేల కోట్లు కొల్లగొట్టిన బాలీవుడ్ బాద్‌షా హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయిపోయారు. అభిమానుల భారీ అంచనాల మధ్య మూడో చిత్రం విడుదలకు సిద్ధమైంది. అయిత ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న ఈ సినిమా.. పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ సలార్‌తో పోటీ పడనుంది.

ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు కావడంతో థియేటర్ల విషయంలో వివాదం తలెత్తింది. ఇప్పటికే  పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లలో డంకీ ప్రదర్శనకు సమానంగా స్క్రీన్స్ కేటాయిచాలని హోంబలే ఫిల్మ్స్ సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది. కానీ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం డంకీతో సమానంగా ప్రభాస్ సలార్‌కు స్క్రీన్స్ ఇవ్వకపోవడంతో నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లలో 'సలార్' చిత్రాన్ని విడుదల చేయటం లేదని ప్రకటించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ థియేటర్లలో బుకింగ్ చేసుకున్న ఆడియన్స్ టికెట్స్ క్యాన్సిల్ కావడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అంతే కాకుండా  ట్విటర్‌లోనూ బాయ్‌కాట్‌ పీవీఆర్‌ ఐనాక్స్‌ అని ట్రెండింగ్‌ అయింది. 

గూస్‌బంప్స్‌ తెప్పిస్తోన్న సెకండ్ ట్రైలర్.. 

సలార్ రెండో ట్రైలర్ రిలీజ్ తర్వాత సలార్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా శ్రుతిహాసన్ నటించింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు.


     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement