గోల్‌ ‘మాల్స్‌’పై కొరడా.! | Department of Minerals Raids On Cimema Malls In Hyderabad | Sakshi
Sakshi News home page

గోల్‌ ‘మాల్స్‌’పై కొరడా.!

Published Fri, Aug 3 2018 10:39 AM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

Department of Minerals Raids On Cimema Malls In Hyderabad - Sakshi

కాచిగూడ ఐనాక్స్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు

సాక్షి,సిటీబ్యూరో:  గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మల్టీప్లెక్స్, థియేటర్ల చేతివాటంపై తూనికల కొలుతల శాఖ కన్నెర చేసింది. మల్టీప్లెక్స్, థియేటర్లలో  ప్యాకేజ్డ్‌ కమోడిటీస్‌ చట్టం (ఎమ్మార్పీ) అమలు ఉల్లంఘనపై గురువారం ‘సాక్షి’ దిన పత్రికలో ‘ఆగని గోల్‌ మాల్స్‌’  శీర్షికతో ప్రచురితమైన  కథనంపై  తూనికలు, కొలుతల శాఖ స్పం దించింది. ఎంఆర్‌పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తున్న పలు మల్టీప్లెక్స్‌లపై గురువారం మూకు మ్మడి దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసి ంది. నగరంలోని 20 మల్టీప్లెక్స్‌లపై తూనికలు, కొలుతల శాఖ అసిస్టెంట్‌ కంట్రోలర్లు భాస్కర్‌రెడ్డి, జగన్మోహన్‌ రెడ్డి, విజయసారథి, నిర్మల్‌ కుమార్, రాజేశ్వర్, శివానంద్‌ ఆధ్వర్యంలో సుమా రు 30 మందితో కూడిన ఏడు ప్రత్యేక  బృందాలు తనిఖీలు నిర్వహించాయి. నిబంధనలు పాటించకుండా వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్న 18 మల్టీప్లెక్స్‌లలో 54 కేసులు నమోదు చేశాయి. 

కేసులు నమోదైన మాల్స్‌ ఇవే...
ఈ సందర్భంగా అధికారులు ఐమాక్స్, పీవీఆర్‌ గెలీలియో, పీవీఆర్‌ ఐకాన్‌ మాదాపూర్, జీవీకే వన్‌ బంజారాహిల్స్, బిగ్‌ సినిమా కాచిగూడ, మహాలక్ష్మి కొత్తపేట, బీబీకే మల్టీప్లెక్స్‌ ఎల్‌బీనగర్,  ఏషియన్‌ సినిమా స్క్వైర్‌ ఉప్పల్, ఏషియన్‌ రాధిక ఈసీఐఎల్,  సినీపోలీస్‌ మల్కాజిగిరి,  తాళ్లూరి ఈసీఐఎల్, స్పెషల్‌ సినిమా ప్రై.లి. మల్లాపూర్,  ఏషియన్‌ ముకుంద మేడ్చల్,  ఏషియన్‌ సినీ ప్లాంట్‌ కొంపల్లి,  సుజనా ఫోరం మాల్‌ కూకట్‌పల్లి,  మంజీరా మాల్‌ జేఎన్‌టియూ, సినీపోలీస్, శంషాబాద్, ఏషియన్‌ సినిమా టౌన్, మియాపూర్‌ మల్టీప్లెక్స్‌లపై కేసులు నమోదు చేశారు.

కూకట్‌పల్లిలో ఇలా...
సుజనా ఫోరం మాల్‌లోని పీవీఆర్‌ సినిమాలో తనిఖీలు నిర్వహించిన అధికారులు కూల్‌ డ్రింక్స్‌ కప్‌లపై లార్జ్, స్మాల్‌ అనే సంకేతాలు తప్ప ఎంత పరిమాణం(లీటర్లలో) పేర్కొన లేదని గుర్తించారు. పీవీఆర్‌ మఖానా ప్యాక్‌పై కస్టమర్‌ కేర్‌కు సంబంధించిన సమాచారం లేదు. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఎమ్మార్పీ ధరల అమలుకు సంబంధించి జారీచేస్తున్న బిల్లులను సైతం సరిపోల్చుకున్నారు.  మంజీ రా ట్రినిటీ మాల్‌లో గల సినీపోలీస్‌లోనూ తినుబండారాల విక్రయ కేంద్రా ల వద్ద సరైన సమాచారం లేకపోవడం, పాప్‌కార్న్‌ ప్యాక్‌లు, కూల్‌ డ్రింక్‌ కప్‌లపై పరిమాణం తెలిపే వివరాలు లేకపోవడాన్ని గుర్తించా రు.  వేయింగ్‌ మెషిన్లపై అధికారిక ముద్ర, సీల్‌ లేకపోవడాన్ని గుర్తించి మూడు కేసులు నమోదు చేశారు.  కొత్తపేటలోని మహాలక్ష్మీ, మిరాజ్‌ సినిమా మల్టీప్లెక్స్‌ హాళ్లను తనిఖీ చేసిన అధికారులు మహాలక్ష్మీ థియేటర్‌ నిర్వాహకులపై మూడు కేసులు నమోదు చేశారు. 

కాచిగూడలో..
సుల్తాన్‌బజార్‌: కాచిగూడ క్రాస్‌రోడ్స్‌లోని ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌లో సమోసాలు, పాప్‌కార్న్, కూల్‌ డ్రింక్స్‌ ధరలను చూసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అధిక ధరలకు విక్రయిస్తున్న పాప్‌కార్న్‌ ఇతర ఆహార పదార్థాలను స్వాధీనం చేసు కుని నోటీసులు జారీ చేశారు.  అదే విధంగా ఏఎస్‌రావునగర్‌లోని ఆసియా సినిమా(రాధిక మల్టీప్లెక్స్‌), తాళూరి ధియేటర్ల క్యాంటిన్‌లలో నిబ ంధనలకు విరుద్దంగా తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తుండటమేగాక నిర్ణీత పరిమాణానికి తక్కువగా తినుబండరాలను, కూల్‌డ్రింకులను వి క్రయిస్తున్నట్లు గుర్తించి మూడు కేసులు నమోదు చేశారు.

మాల్స్‌లో బిల్లింగ్‌ మెషిన్లు సీజ్‌
తూనికలు, కొలతల శాఖ అధికారులు మాల్కాజిగిరి సినీపోలీస్, ఐమాక్స్‌ ప్రసాద్, తాళ్లూరి,  స్పెషల్‌ సినిమాక్స్, ఐనాక్స్‌ కాచిగూడ, శంషాబాద్‌ సినీపోలీస్‌ మల్టీప్లెక్స్‌లలో బిల్లింగ్‌ మెషిన్లు సీజ్‌ చేశారు.

ధరల పట్టికల ఏర్పాటు...
చిక్కడపల్లి:   ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని  దేవి, సుదర్శ న్‌ థియేటర్‌లో ధరల సూచిక బోర్డు చేశారు. సూచిక బోర్డు కింద తూనికలు కొలతల శాఖకు ఫిర్యాదు చేయాల్సిన నంబర్లను సైతం అందుబాటులో ఉంటారు. టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800450033, వాట్సప్‌ నంబర్‌ 7330774444 నంబర్లు  అందుబాటులో ఉంచారు. ప్రధానంగా  సినిమా హాల్స్, మల్టీఫ్లెక్స్‌లలో అధిక ధరలకు అమ్ముతున్నట్లు తూనికల కొలతల శాఖకు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో శాఖ అదేశాల మేరకు  థియేటర్‌ యాజ మానులు స్పందించి సూచిక బోర్డును ఏర్పాటు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement