మలయాళంలో బ్లాక్ బస్టర్ టాక్ తో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమా 'మంజుమ్మల్ బాయ్స్'. తాజాగా ఏప్రిల్ 6న తెలుగులో రిలీజై అదే స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందుతోంది. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ క్రమంలో అనూహ్యాంగా పీవీఆర్ మల్టిఫ్లెక్స్ మంజుమల్ బాయ్స్ తెలుగు వర్షన్ ప్రదర్శనలను ఆపేసింది.
(ఇదీ చదవండి: ప్రముఖ నటి భర్తకు గుండెపోటు.. అందువల్లే..)
మలయాళ నిర్మాతతో ఉన్న వివాదం కారణంగానే ఆ చిత్ర ప్రదర్శనలను ఆపేసినట్లు పీవీఆర్ యాజమాన్యం వెల్లడించింది. పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మలయాళ నిర్మాతతో వివాదం ఉంటే తెలుగు వర్షన్ ను ఎలా ఆపేస్తారని ప్రశ్నించారు.
మంచి వసూళ్లు సాధిస్తున్న క్రమంలో అర్థాంతరంగా ఆపేయడం అన్యాయమన్న శశిధర్ రెడ్డి... ప్రదర్శనలు ఆపడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నట్లు తెలిపారు. పీవీఆర్ మల్టిప్లెక్స్ వ్యవహారశైలిని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై గురువారం సాయంత్రం అత్యవసర సమావేశం కానుంది.
(ఇదీ చదవండి: నాలుగేళ్ల గొడవ క్లియర్.. హీరో-కమెడియన్ కలిసిపోయారు!)
Comments
Please login to add a commentAdd a comment