ఇండస్ట్రీ రికార్డ్‌ క్రియేట్‌ చేసిన మలయాళం సినిమా తెలుగులో ఎప్పుడంటే | Telugu Version Of Manjummel Boys Movie Release On This Date - Sakshi
Sakshi News home page

ఇండస్ట్రీ రికార్డ్‌ క్రియేట్‌ చేసిన మలయాళం సినిమా తెలుగులో ఎప్పుడంటే

Published Sat, Mar 16 2024 2:07 PM | Last Updated on Sat, Mar 16 2024 2:15 PM

Manjummel Boys Collection All Time Record In Malayalam Industry - Sakshi

మలయాళంలో ప్రేమలు,  మంజుమ్మెల్ బాయ్స్ రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రేమలు చిత్రం రూ. 100 కోట్ల మార్క్‌ను దాటి విజయవంతంగా రన్‌ అవుతుంది. అదే విధంగా మంజుమ్మెల్ బాయ్స్ మూవీ కూడా రూ. 190 కోట్లు కలెక్షన్స్‌ రాబట్టింది. త్వ‌ర‌లోనే 200 కోట్ల మార్కును కూడా దాటేయ‌బోతోందీ చిత్రం. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా మంజుమ్మెల్ బాయ్స్ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పుడీ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేయబోతోంది మైత్రీ మూవీ మేకర్స్.

ఇతర భాషల్లో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్న సినిమాలను తెలుగులో విడుదల చేయడం సాధారణం అయ్యింది. ఈ క్రమంలో మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ తెలుగులోనూ ఈ సినిమా ప్రమోషన్లను పెద్ద ఎత్తున నిర్వహించి ఆ తర్వాత రిలీజ్ చేయాలని గతంలో వాయిదా వేశారు. మార్చి 29న తెలుగులో రిలీజ్ కానుందని మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే వెల్లడించింది. డైరెక్టర్ చిదంబరం ఈ మూవీని రూ.20 కోట్ల బడ్జెట్​లో తెరకెక్కించారని వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి 22న విడుదల అయిన ఈ సినిమాకు భారీ స్పందన లభించింది.  సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో సౌబిన్‌ షాహిర్‌, సీనియర్ నటుడు లాల్‌, అరుణ్​ కురియన్, ఖలిడ్​ రెహ్మాన్, శ్రీనాథ్‌ భసి, బాలు వర్గీస్​, గణపతి, అభిరామ్ రాధాకృష్ణన్​, ​దీపక్‌ పరంబోల్‌, షెబిన్​ బెన్సన్​, లాంటి స్టార్స్ కీలక పాత్రలో పోషించారు.

2006లో రియల్‌గా జరిగిన ఓ  ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆ ఏడాదిలో కేరళకు చెందిన కొందరు యువకులు తమిళనాడులోని కొడైకెనాల్లో ఉన్న గుణ గుహలకు విహారయాత్రకు వెళ్లారు. అందులో ఒక యువకుడు పొరపాటున ఓ లోతైన గుహలోకి జారి పడిపోతాడు. ఆ తర్వాత అతన్ని స్నేహితులు ఎలా కాపాడుతారన్నదే  'మంజుమ్మెల్ బాయ్స్' స్టోరీ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement