'రెండు చెత్త సినిమాలే'.. ట్వీట్లతో రెచ్చిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్! | Oosaravelli Fame Payal Ghosh Sensational Tweets On Prabhas Salaar And Shah Rukh Khan Dunki Movies Goes Viral - Sakshi
Sakshi News home page

Payal Ghosh Viral Tweets: సలార్‌ చెత్త సినిమా.. కానీ.. పాయల్ వరుస ట్వీట్స్!

Published Sun, Dec 24 2023 6:21 PM | Last Updated on Sun, Dec 24 2023 7:14 PM

Oosaravelli Fame Payal Ghosh Tweets On Salaar and Dunki Movies - Sakshi

మిస్టర్ రాస్కెల్, ప్రయాణం, ఊసరవెల్లి చిత్రాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న భామ పాయల్ ఘోష్. టాలీవుడ్ మూవీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన ఊసరవెల్లి చిత్రంలో మెప్పించిన భామ.. ఆ తర్వాత టాలీవుడ్‌ సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం సినిమాల్లో ఆమె ఏ సినిమాలో నటించడం లేనది తెలుస్తోంది. అయితే తాజాగా పాయల్ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవలే థియేటర్లలో రిలీజైన డంకీ, సలార్‌ చిత్రాలను ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్స్  

పాయల్ తన ట్వీట్‌లో రాస్తూ..' 2023లో రిలీజైన సినిమాలు ఒక్కటీ కూడా చూడలేని విధంగా ఉన్నాయి. అన్నీ చెత్త సినిమాలే వస్తున్నాయి. డంకీ, సలార్ కూడా చెత్తగా ఉన్నాయి. తన కెరీర్‌లో మొదటిసారి రాజ్ కుమార్ హిరానీ ఫ్లాప్ సినిమా తీశాడు. డంకీ, సలార్ రెండు చెత్త సినిమాలే. కానీ సలార్ చిత్రానికి భారీ కలెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే ప్రభాస్‌ యంగ్ అండ్ పవర్‌ఫుల్‌ పర్సన్. ఆయనకు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందని' రాసుకొచ్చింది. అంతేకాకుండా ఈ ఏడాది రిలీజైన పఠాన్, జవాన్, యానిమల్ చిత్రాలు కూడా చెత్త సినిమాలేనంటూ వరుస ట్వీట్లు చేసింది. అయితే పాయల్ చేసిన ట్వీట్లకు ఎవరూ కూడా పెద్దగా రియాక్ట్ అవడం లేదు. అవకాశాల్లేకపోవడంతో ఫేమస్ అయ్యేందుకే ఇలా చేస్తోందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.  కాగా.. ఈ ఏడాది 'ఫైర్ ఆఫ్ లవ్: రెడ్' అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement