oosaravelli
-
'రెండు చెత్త సినిమాలే'.. ట్వీట్లతో రెచ్చిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్!
మిస్టర్ రాస్కెల్, ప్రయాణం, ఊసరవెల్లి చిత్రాలతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న భామ పాయల్ ఘోష్. టాలీవుడ్ మూవీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన ఊసరవెల్లి చిత్రంలో మెప్పించిన భామ.. ఆ తర్వాత టాలీవుడ్ సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం సినిమాల్లో ఆమె ఏ సినిమాలో నటించడం లేనది తెలుస్తోంది. అయితే తాజాగా పాయల్ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవలే థియేటర్లలో రిలీజైన డంకీ, సలార్ చిత్రాలను ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్స్ పాయల్ తన ట్వీట్లో రాస్తూ..' 2023లో రిలీజైన సినిమాలు ఒక్కటీ కూడా చూడలేని విధంగా ఉన్నాయి. అన్నీ చెత్త సినిమాలే వస్తున్నాయి. డంకీ, సలార్ కూడా చెత్తగా ఉన్నాయి. తన కెరీర్లో మొదటిసారి రాజ్ కుమార్ హిరానీ ఫ్లాప్ సినిమా తీశాడు. డంకీ, సలార్ రెండు చెత్త సినిమాలే. కానీ సలార్ చిత్రానికి భారీ కలెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే ప్రభాస్ యంగ్ అండ్ పవర్ఫుల్ పర్సన్. ఆయనకు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందని' రాసుకొచ్చింది. అంతేకాకుండా ఈ ఏడాది రిలీజైన పఠాన్, జవాన్, యానిమల్ చిత్రాలు కూడా చెత్త సినిమాలేనంటూ వరుస ట్వీట్లు చేసింది. అయితే పాయల్ చేసిన ట్వీట్లకు ఎవరూ కూడా పెద్దగా రియాక్ట్ అవడం లేదు. అవకాశాల్లేకపోవడంతో ఫేమస్ అయ్యేందుకే ఇలా చేస్తోందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ ఏడాది 'ఫైర్ ఆఫ్ లవ్: రెడ్' అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది. #dunki bhi Faltu film au Aur #Salaar bhi lekin #Salaar will own more money because #Prabhas is not vfxd 😂he’s young and powerful.. dono film ho ghatiya hai 😅✔️ — Payal Ghoshॐ (@iampayalghosh) December 24, 2023 Ek bhi film dekhne layak nahi thi2023 mein sab Ghatiya film the…chahe woh pathan, jawan , animal, etc sab ke sab ghatiya film the Aur. Dunki and salaar.. sab ka review ghatiya hai 🤣🤣🤣 first time Raj kumar Hirani made a flop 🤣🤣 — Payal Ghoshॐ (@iampayalghosh) December 23, 2023 Koi nahi #Salaar bhi flop hai Aur #Dunki bhi dono ghatiya films audience ko chutiya bana rahe hai 😂😂😂😅 — Payal Ghoshॐ (@iampayalghosh) December 24, 2023 -
వాళ్లు అయితే నా దుస్తులు తొలగించేవారు.. ఊసరవెల్లి బ్యూటీ కామెంట్లు
పాయల్ ఘోష్ కలకత్తాకు చెందిన ఈ బ్యూటీ. మంచు మనోజ్ నటించిన 'ప్రయాణం' సినిమాతో సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'ఊసరవెల్లి' సినిమాలో తమన్నా ఫ్రెండ్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం 'మిస్టర్ రాస్కెల్' సినిమాలో నటించిన తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. కానీ అక్కడ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. దానికి ప్రధాన కారణం అక్కడి పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులే అని ఆమె పలుమార్లు చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: బోరున ఏడ్చేసిన రతిక తల్లిదండ్రులు.. అందరినీ కదిలిస్తున్న వ్యాఖ్యలు ) తాజాగా బాలీవుడ్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. దేవుడి దయ వల్ల నేను సౌత్ ఇండస్ట్రీ నుంచి సినిమాల్లోకి లాంచ్ అయ్యాను. ఒకవేళ నేను బాలీవుడ్ నుంచి ఎంట్రీ ఇచ్చి ఉండుంటే నా దుస్తులు తొలగించేవారు. అంతటితో ఆగక అలాంటి సన్నివేశాలతో ఇప్పటికే వ్యాపారం చేసుకునేవారు. వాళ్లకు టాలెంట్‌తో పనిలేదు. అమ్మాయిలు దుస్తులు తొలగిస్తే చాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో మీ టూ ఉద్యమంలో పాయల్ ఘోష్ పాల్గొనింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మీద ఆమె సంచనల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది. సినిమాలో అవకాశం కోసం కలిసినప్పుడు అతడు తనపై లైంగిక దాడి చేశాడని అప్పట్లో ఆమె వెల్లడించింది. సౌత్ ఇండస్ట్రీలో జూ. ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని రాబోయే రోజుల్లో బాలీవుడ్‌ను ఏలుతాడని ఆమె ఎప్పుడో చెప్పింది. ఆమె చెప్పినట్లే ఆర్ఆర్ఆర్తో ప్రపంచానికే తను ఎంటో సాటి చెప్పాడు తారక్. Thank god, I got launched in South Film Industry, if I would have got launched in #Bollywood they would have removed my clothes to present me, cos they use female bodies more than their creativity 😔 — Payal Ghoshॐ (@iampayalghosh) October 1, 2023 -
అక్షయ్ ఊసరవెల్లి
టాలీవుడ్లో ఘన విజయం సాధించిన చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ అవుతుండటం తెలిసిందే. తెలుగు చిత్రాలను బాలీవుడ్ ప్రేక్షకులకు అందించడంలో హీరో అక్షయ్ కుమార్ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటికే పలు టాలీవుడ్ చిత్రాల రీమేక్‌లో నటించిన ఆయన తాజాగా మరో సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారని టాక్. ఎన్టీఆర్, తమన్నా జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊసరవెల్లి’. 2011లో విడుదలైన ఈ చిత్రాన్ని తాజాగా బాలీవుడ్లో రీమేక్ చేయనున్నారని సమాచారం. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ చూసిన అక్షయ్ కుమార్ ఫిదా అయ్యి, హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారట.కాగా ఇప్పటికే ‘టిప్స్’ అనే సంస్థ ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులు కొనుగోలు చేసిందట.. ప్రస్తుతం బాలీవుడ్‌కి తగ్గట్టు కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారని టాక్. అయితే ఈ సంస్థ నిర్మించే చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనే విషయంపై క్లారిటీ లేదు. మరి ‘టిప్స్’ సంస్థ నిర్మించే చిత్రంలో అక్షయ్ కుమార్ నటిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి. కాగా ఇప్పటికే తెలుగులో హిట్ అయిన ‘అల వైకుంఠపురములో, ఇస్మార్ట్ శంకర్, ఛత్రపతి’ సినిమాలు తాజాగా బాలీవుడ్లో రీమేక్ కానున్నాయి. -
ఆ రెండు చిత్రాల తర్వాత చెప్పుకోదగ్గవి రాలేదు!
‘‘దక్షిణాదిన అగ్ర హీరోలందరి సరసన నటించేశాను. బోల్డన్ని కమర్షియల్ కేరక్టర్స్ చేశాను. కెరీర్ మొదట్లో ‘నేనీ పాత్ర చేయను. నా కోసం అలాంటి పాత్రలు రాయండి’ అని చెప్పే అవకాశం దాదాపు ఎవరికీ ఉండదు. అందుకే, ఇప్పటివరకు ఏది వస్తే అది చేశాను. వాటిలో మనసుకి నచ్చినవి కూడా ఉన్నాయనుకోండి. అయితే ఇక నుంచి మాత్రం పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహించాలనుకుంటున్నా’’ అని హీరోయిన్ తమన్నా చెప్పారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారీ బ్యూటీ. వీటిలో ‘బాహుబలి’ చిత్రం కూడా ఉంది. ఈ చిత్రంలో ఫైట్స్ కూడా చేశానని, తనది చాలా మంచి పాత్ర అని తమన్నా చెబుతూ -‘‘నిజానికి ‘100% లవ్’, ‘ఊసరవెల్లి’ తర్వాత నాకు చెప్పుకోదగ్గ పాత్రలేవీ రాలేదు. వచ్చిన వాటిలో కొంచెం ఫర్వాలేదనిపించినవి చేశాను. ‘బాహుబలి’లోది మంచి పాత్ర. నాకు ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్’ లాంటి చిత్రం కానీ, లేడీ ఓరియంటెడ్ మూవీ కానీ చేయాలని ఉంది. ఆ తరహా చిత్రాలకు అవకాశం వస్తే, వెంటనే ఒప్పుకుంటా. కథానాయికగా నేనో వంద సినిమాలు చేశాననుకోండి, భవిష్యత్తులో చెప్పుకోడానికి పది, ఇరవై అయినా ఉండాలిగా. ఇప్పుడది దృష్టిలో పెట్టుకుని పాత్రలు ఎంపిక చేసుకుంటున్నా’’ అన్నారు.