
సలార్ మూవీ సెప్టెంబర్ లోనే వచ్చి ఉంటే బాగుండేదేమో డిసెంబర్‌లో అంటే లేని పోని సమస్యలు వస్తున్నాయి.ఆల్రెడీ షారుఖ్ పోటీలో ఉన్నాడు.ఇప్పుడు కింగ్ ఖాన్ తో పాటు హాలీవుడ్ నుంచి ఒక మరో సూపర్ హీరో కూడా సలార్ తో ఫైట్‌కి రెడీ అంటున్నాడు.అయితే ఎంత మంది వచ్చినా, డైనోసార్ ముందు జుజూబీనే అంటున్నాడు రెబల్.
వెయ్యి కోట్ల హీరోతో పోటీ
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం సలార్. కేజీయఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కావడంతో సలార్‌పై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కావాల్సింది. కానీ అనూహ్యం వాయిదా పడింది. ఏవోవే కారణాలు చెప్పి డిసెంబర్ 22కు పోస్ట్‌పోన్ చేశాడు ప్రశాంత్ నీల్. అయితే ఇప్పుడు సలార్‌పై అంతకంతకూ పోటీ పెరుగుతోంది.
ఇప్పటికే జవాన్ తర్వాత షారుఖ్ నటిస్తున్న డంకీ ఇదే డేట్ కు రిలీజ్ అవుతోంది. అసలే షారుఖ్ వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వెయ్యి కోట్ల కలెక్షన్లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. ఆయన నటించిన గత రెండు చిత్రాలు పఠాన్, జవాన్..రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి.అలాంటి హీరోతో సలార్ పోటీకి సిద్ధమవుతున్నాడు.డిసెంబర్ 22న సలార్ వర్సెస్ డంకీ ఫైట్ గురించి ఇప్పటికే ఇండియా మొత్తం మాట్లాడుకుంటోంది. ఇప్పుడు ఇదే డేట్ గురించి వరల్డ్ మొత్తం మాట్లాడుకునేలా చేస్తున్నాడు ఆక్వామేన్.
డంకీ, సలార్‌కి పోటీగా ఆక్వామేన్
ఆక్వామేన్ అండ్ ది లాస్ట్ కింగ్ డమ్ మూవీ డిసెంబర్ 25న విడుదల కావాల్సింది. అయితే ఇప్పుడు మూడు రోజుల ముందుగానే.. అంటే డిసెంబర్ 22నే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే రోజు సలార్, డంకీ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆక్వామేన్ హంగామా అంతా హాలీవుడ్ కే పరిమితం అనుకోవడానికి వీలు లేదు.
ఎందుకంటే ఆక్వామ్యాన్ వల్ల ఓవర్సీస్ మార్కెట్ లో ఇటు సలార్, అటు డంకీకి స్క్రీన్స్ సమస్య వస్తుంది. స్క్రీన్స్ అడ్జెస్ట్ మెంట్ అంటే కలెక్షన్స్ కూడా పంచుకోవాల్సి వస్తుంది. కలెక్షన్స్ పంచుకోవడం అంటే డే వన్ రికార్డులు మిస్ అయినట్లే అవుతుంది.అందుకే సలార్ కూడా ముందుగా అనుకున్నట్లు సెప్టెంబర్ లోనే వచ్చి ఉంటే ఇటు డంకీతోనూ, అటూ అక్వామేన్ తోనూ పోటీ పడే ఇబ్బంది తప్పేది.
అయితే ఎక్కువ స్క్రీన్స్ కోసం ఆల్రెడీ సలాన్ నిర్మాతలు రంగంలోకి దిగారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఏమాత్రం డిజప్పాయింట్ కాకుండా డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‌గా సలార్ ను ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేసేందుకు చేయాల్సిదంతా చేస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి క్రిస్మస్ మాత్రం నిరుడు లెక్క ఉండదు. సలార్ ఇటు సౌత్ మార్కెట్‌ను, డంకీ అటు నార్త్ మార్కెట్‌ను, ఆక్వామేన్ ఓవర్సీస్ మార్కెట్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment