ఇంటి దొంగను పట్టేసింది! | Anushka Chaught Leaks Person | Sakshi
Sakshi News home page

ఇంటి దొంగను పట్టేసింది!

Published Sun, May 14 2017 2:44 AM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM

ఇంటి దొంగను పట్టేసింది!

ఇంటి దొంగను పట్టేసింది!

దక్షిణాదిలో డేరింగ్‌ బ్యూటీగా పెరొందిన నటి అనుష్క. కథానాయకిగా పలు దశలను దాటి టాప్‌ నటిగా రాణిస్తున్న ఈ యోగా సుందరి కెరీర్‌ అరుంధతికి ముందు ఆ తరువాత అన్నట్టుగా ఒక దశ, రుద్రమదేవి, బాహుబలి అంటూ మరో దశ, తాజాగా బాహుబలి– 2తో అత్యున్నత దశ అంటూ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం భాగమతి అంటూ తెరపైకి రావడానికి రెడీ అవుతున్న అనుష్క గురించి వదంతులు అదే స్థాయిలో హల్‌చల్‌ చేస్తున్నాయి. నటుడు ఆర్యతో చెట్టాపట్టాల్‌ అని, రానాతో సరాగాలని పలు వదంతులు ప్రచారంలో ఉన్నాయి.

తాజాగా బాహుబలి ఫేమ్‌ ప్రభాస్‌తో ప్రేమ వ్యవహారం, త్వరలో పెళ్లికి సిద్ధం అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వీటికి స్పందించిన ఈ స్వీటీ అసలు ఈ వదంతులు ఎలా పుడుతున్నాయి. ఎవరు తన వ్యక్తిగత విషయాల గురించి మీడియాకు ఉప్పందిస్తున్నారు? అన్న విషయాలపై కన్నేశారట. దీంతో లీకుల దొంగ దొరికేశాడట. అతనెవరో కాదు తన వద్ద పని చేసే సహాయకుడేనని అనుష్క నిఘాలో బయట పడిందట. అంతే వెంటనే అతకి లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చి పని నుంచి వెంటనే తొలగించారట. సాధారణంగా ఇంటిదొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడంటారు. అనుష్క కాస్త షార్ప్‌ అట. అందుకే తన వెనుక గోతులు తవ్వుతున్న వక్తిని పసి గట్టి పని బట్టి ఇంటికి పంపించేసిందట. అనుష్క నా మజాకా అంటున్నారు సినీవర్గాలు. ఇంతకీ ప్రభాస్‌తో ప్రేమాయణం వ్యవహారంలో నిజమెంత?ఈ విషయాన్ని కాలానికే వదిలేద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement