
‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హీరో కల్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్.
ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఫారిన్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బెట్స్ డిజైన్ చేసిన ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్ పాల్గొంటున్నారట. షిప్‌లో సాగే ఈ ఫైట్ కోసం ప్రస్తుతం చిత్రయూనిట్ నైట్ షూట్ జరుపుతోంది. కాగా ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ను గోవాలో ప్లాన్ చేశారని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, జాన్వీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment