
జాన్వీ కపూర్ డాటరాఫ్ శ్రీదేవి గురించి బాలీవుడ్‌లో చాలామంది చేస్తున్న కామెంట్ ‘తనకు బిడియమా? పొగరా’ అని. సెలబ్రిటీల వారసులకు కొన్ని తిప్పలు తప్పవు. ఎక్కడికెళ్లినా, ఏం చేసినా టాపిక్కే. జాన్వీ కపూర్ అయితే సినిమాల్లోకి రాకముందు నుంచీ వార్తల్లో నిలిచింది. ఎక్కడ కనిపించినా కెమెరాలు వెంటాడుతుంటాయి. రూమర్స్ క్రియేట్ చేయడానికి ఔత్సాహికరాయుళ్లు ఎలానూ ఉంటారు. ఇక, సినిమాల్లోకొచ్చేస్తే డోస్ ఇంకా పెరుగుతుంది. ప్రస్తుతం జాన్వీ ‘ధడక్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో ఇషాన్ కట్టర్ హీరో. ఈ ఇద్దరూ కలసి సరదాగా డిన్నర్‌కి వెళ్లారు. డిన్నర్ అంతా బాగానే సాగింది. ఫైనల్లీ ‘మళ్లీ కలుద్దాం’ అంటూ ఇషాన్ బై చెప్పి వెళుతుండగా, ఓ కుర్రాడు జాన్వీ దగ్గరకొచ్చి ‘సెల్ఫీ ప్లీజ్’ అన్నాడు. జాన్వీ అతన్ని లెక్క చేయకుండా అక్కణ్ణుంచి నిష్క్రమించింది. పాపం.. టీనేజ్ అమ్మాయి. ఎంత సినిమా వాతావరణంలో పెరిగినా ఫ్యాన్స్ దూసుకొస్తే కంగారుగానే ఉంటుంది కదా. బహుశా సెల్ఫీ ఇవ్వాలో లేదో తెలియక జాన్వీ తికమకపడిం దేమో అన్నది కొందరి అభిప్రాయం. ఇంకొందరు మాత్రం ‘అది బిడియమా? పొగరా?’ అనే ప్రచారం మొదలుపెట్టారు. కానీ, మొదటిదే కరెక్ట్ అయ్యుండొచ్చేమో.
Comments
Please login to add a commentAdd a comment