
జయప్రద
అప్పట్లో మీతో పాటు ఇండస్ట్రీని రూల్ చేసిన శ్రీదేవిగారి గురించి..
జయప్రద: ప్రతి పాత్రలోనూ జీవించాలని ఎంతో కష్టపడేది. ఆన్‌స్క్రీన్ స్టైల్‌గా కనిపించడంతో పాటు ఎమోషన్స్‌ను ఎంతో బ్యాలెన్డ్స్‌గా పలికించేది. గొప్ప నటి ఆమె. అంతేకాదు గొప్ప అమ్మ కూడా. తన జీవితంలోకి అన్ని రంగులు త్వరగానే వచ్చేసాయేమో అనిపిస్తుంది. తక్కువ వయసులోనే సక్సెస్ చూసింది. తక్కువ వయçసులోనే వెళ్లిపోయింది. అందుకే దేవుడు జీవితంలోని అన్ని కలర్స్‌ను తనకు త్వరగా చూపించాడేమో అనిపిస్తుంది. శ్రీదేవి మనతో లేరు అనేది ఒక నమ్మలేని నిజం. మళ్లీ తిరిగి రానటువంటి నిజం. చివరి క్షణాల్లోనూ ఆనందంగా ఉన్న సమయాల్లోనే కన్ను మూసింది. ఒక కల్యాణానికి వెళ్లి అక్కడ అందరితో సరదాగా ఉంటున్న సమయంలో తుది శ్వాస విడిచింది. అంటే.. ఒక మనిషి జీవితం ఎంత చిన్నదో తెలుసుకోవచ్చనిపిస్తోంది.
మీరిద్దరూ ఎక్కువగా కలుస్తుండేవారా?
జయప్రద:తరచూ కాకపోయినా అప్పుడప్పుడూ మేము కలుస్తూనే ఉండేవాళ్లం. మా ఇంట్లో జరిగిన పెళ్లి (జయప్రద అక్క కుమారుడు సిద్ధార్థ్ వెడ్డింగ్) వేడుకకు భర్త బోనీ కపూర్‌తో సహా శ్రీదేవి వచ్చింది. అందర్నీ ఆప్యాయంగా పలకరించింది. సరదాగా టైమ్ స్పెండ్ చేసింది. నా లైఫ్‌లో అవి మెమొరబుల్ మూమెంట్స్‌లా మిగిలిపోయాయి.
మీరిద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు కదా.. విభేదాలేమైనా?
జయప్రద:జయసుధ, శ్రీదేవి, నాకు మధ్యలో ఎప్పుడూ ఎలాంటి విభేదాలు లేవు. ఒక మాట అనుకోవడం కూడా లేదు. అయితే.. మీడియా ఒక ప్రొఫెషనల్ హైప్‌ను క్రియేట్ చేసింది. మా మధ్య ఎటువంటి తగువులు లేవు. ‘దేవత’లో తను నాకు చిట్టిచెల్లెలిగా చేసింది. మరో సినిమాలో సవతిగా చేసింది. డిఫరెంట్ రోల్స్ చేశాం. ఒకర్ని మించి ఒకరం బాగా చేయాలని తప్పిస్తే వేరే ఏమీ ఉండేది కాదు.
శ్రీదేవి నటించినవాటిలో మీకు నచ్చిన సినిమాలు?
జయప్రద:జగదేకవీరుడు అతిలోకసుందరి, దేవత సినిమాలు. తను చేసిన హిందీ సినిమాలూ ఇష్టమే. తన సినిమా కెరీర్ అద్భుతమైనది. సినిమా లైబ్రరీలో తనదో ప్రత్యేకమైన స్థానం ఉండాలి. ఆమె లాంటి ఆర్టిస్టు మళ్లీ రావడం కష్టం.
జాన్వీ హీరోయిన్‌గా సినిమా చేస్తున్న విషయం తెలిసే ఉంటుంది..
జయప్రద:ఇన్నాళ్లూ కూతుళ్లకు తోడుగా ఉంది. ఇప్పుడు కూతురు సినిమా చేస్తున్న సమయానికి తోడుండి చూసుకోలేకపోయింది. జాన్వీ ఎంతో దుఃఖంలో ఉంటుంది. రెండో పాప ఖుషీ కూడా. జాన్వీని ఆన్‌స్క్రీన్‌పై చూసుకోవాలన్న శ్రీదేవి ఆశ నేరవేరలేదని బాధగా ఉంది. ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ఇది తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను.
Comments
Please login to add a commentAdd a comment