
ధడక్ ట్రైలర్ లాంచ్‌లో ఖుషీ కపూర్, జాన్వీ కపూర్
జాన్వీ కపూర్‌కు, ఎంటైర్ కపూర్ ఫ్యామిలీకి నేడు బిగ్ డే. అలనాటి అందాల తార శ్రీదేవి, బోని కపూర్‌ల కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్న ధడక్ సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. అనిల్ కపూర్, బోని కపూర్‌ల నుంచి ఖుషీ కపూర్ వరకు ఈ ట్రైలర్ లాంచ్‌కు హాజరయ్యారు. ఈ ఉద్వేగభరిత సందర్భంలో శ్రీదేవీ లేకపోవడం ప్రతి ఒక్కర్ని కలచివేసింది. చిన్న కూతురు ఖుషీ తనను తాను నియంత్రించుకోలేక, తల్లిని తల్లుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. అలా తీవ్ర ఉద్వేగానికి గురైన చెల్లిని, జాన్వీ కపూర్ అక్కుని చేర్చుకుని ఓదార్చడంతో అక్కడున్న వారి కళ్లు చెమ‍్మగిల్లాయి. జాన్వీ సైతం మీడియా ఎంతో ముందు ఎంతో నెర్వస్‌గా ఫీలయ్యారు.
జాన్వీని బాలీవుడ్‌కు పరిచయం చేయడంపై శ్రీదేవీ ఎప్పుడూ కలలు కంటూ ఉండేవారు. తల్లి కలను జాన్వీ నిజం చేయబోతున్నారు. శ్రీదేవి మరణించిన దగ్గర్నుంచి అక్కా చెల్లెళ్లు ఒకరికొకరు ఎంతో చేదుడువాదోడుగా ఉంటున్నారు. వీరికి అన్న అర్జున్ కపూర్, సోదరి అన్హులా కపూర్‌లు కూడా అండగా నిలబడుతూ వస్తున్నారు. నేడు ట్రైలర్ రిలీజ్ సందర్భంగా అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మనసుకు హత్తుకునేలా ఓ పోస్టు కూడా చేశారు. ఇషాన్ ఖట్టర్, జాన్వీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శశాంక్ ఖైటన్ దర్శకత్వం వహిస్తుండగా, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment