జూ ఎన్టీఆర్‌ 'దేవర' టికెట్లు.. ఫస్ట్‌ షో ఎప్పుడంటే..? | Devara Movie First Show Time Out Now | Sakshi
Sakshi News home page

జూ ఎన్టీఆర్‌ 'దేవర' టికెట్లు.. ఫస్ట్‌ షో ఎప్పుడంటే..?

Published Tue, Aug 27 2024 8:04 AM | Last Updated on Tue, Aug 27 2024 9:19 AM

Devara Movie First Show Time Out Now

స్టార్‌ హీరో ఎన్టీఆర్‌- దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్‌ డ్రామా చిత్రం  ‘దేవర’. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత తారక్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎంతగానో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, దేవర్‌ ఫస్ట్‌ షో గురించి ఒక వార్త నెట్టింట ట్రెండ్‌ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు పాన్‌ ఇండియా రేంజ్‌లో పెద్ద సంచలనమే క్రియేట్‌ చేశాయి. మిలియన్ల కొద్ది రీల్స్‌ రూపంలో సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. సెప్టెంబరు 27న ప్రపంచవ్యాప్తంగా దేవర విడుదల కానుంది. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే, సెప్టెంబరు 27న అభిమానుల కోసం తెల్లవారుజామున 1:08 గంటలకు బెన్ ఫిట్ షోస్ వేసేలా మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారని టాక్‌.. ఓవర్సీస్‌లో కూడా ఇదే సమయంలో షో పడనుంది. ఈమేరకు UKలో ఇప్పటికే  దేవర బుకింగ్స్ ఓపెన్ చేశారు. 

టికెట్లు దక్కించుకున్న అభిమానులు నెట్టింట షేర్‌ చేస్తున్నారు కూడా..  తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ను సితార ఎంటైర్మెంట్స్ నిర్మాత నాగవంశీ దక్కించుకున్నారు. సోలోగా దేవర వస్తుండటంతో బాక్సాఫీస్‌ షేక్‌ చేయడం గ్యారెంటీ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ గ్లామర్ డాల్ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement