ధడక్‌... దిగులు పడక్‌ | Karan Johar shares new Dhadak still; it is intense with guns and tears | Sakshi
Sakshi News home page

ధడక్‌... దిగులు పడక్‌

Published Sun, Dec 17 2017 1:49 AM | Last Updated on Sun, Dec 17 2017 1:49 AM

Karan Johar shares new Dhadak still; it is intense with guns and tears - Sakshi

‘‘ప్రేమ ఎప్పుడూ పూల పాన్పు కాదు. అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి. ప్రేమించినంత సులువు కాదు, ఆ ప్రేమను గెలిపించుకోవటం. సమస్యలకు భయపడకుండా పోరాడి నిలబడగలిగితేనే నిజమైన ప్రేమ అంటున్నారు’’ జాన్వీ, ఇషాన్‌. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్, షాహిద్‌ కపూర్‌ తమ్ముడు ఇషాన్‌ కట్టర్‌ పరిచయం అవుతున్న  చిత్రం ‘ధడక్‌’. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఫస్ట్‌ లుక్‌ని ఆ మధ్య విడుదల చేశారు. తాజాగా ఓ స్టిల్‌ బయటకు వచ్చింది.

ఈ ఫొటో చూస్తుంటే జాన్వీ, ఇషాన్‌ దేనికోసమో దిగులు పడుతున్నట్టుగా ఉంది కదూ. ఆ దిగులు ఎందుకోసం అంటే.. ప్రేమికు (సినిమాలో లవర్స్‌)లకు పెద్దవాళ్ల నుంచి వచ్చే సమస్యల వల్లనే అని ఊహించవచ్చు. జాన్వీ, ఇషాన్‌ పరిచయమవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి.. ఈ ఇద్దరూ ఎలా నటించారో తెలియాలంటే వచ్చే ఏడాది జులై వరకూ ఆగాల్సిందే. శశాంక్‌ కైతన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ధర్మ ప్రొడన్స్‌ బ్యానర్‌ పై కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement