జాన్వీ కపూర్
కెరీర్ ఆరంభంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం అంటే సవాల్ లాంటిదే. జాన్వీ కపూర్ అలాంటి సవాల్‌నే అంగీకరించారు. తమిళంలో నయనతార నటించిన ‘కోలమావు కోకిల’ సినిమా హిందీ రీమేక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జాన్వీ. ఇందులో మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిగా తల్లితండ్రుల బాధ్యత తీసుకుని, కేన్సర్ బారిన పడిన తల్లిని కాపాడుకోవడానికి డబ్బు కోసం డ్రగ్స్ ముఠాలో చేరుతుంది కథానాయిక. చివరికి తన జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనేది కథ. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ పంజాబ్‌లో ఆరంభమైంది. ఈ చిత్రానికి ‘గుడ్ లక్ జెర్రీ’ అనే టైటిల్‌ని ఖరారు చేసి, జాన్వీ కపూర్ లుక్‌ని విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment