
షూటింగ్‌లో సీన్ సీన్‌కి మధ్య బ్రేక్‌లు వస్తుంటాయి. ఆ బ్రేక్‌లో కొందరు నచ్చిన పుస్తకంలో మునిగిపోతారు. కొందరు ఏదైనా గేమ్స్ ఆడతారు. జాన్వీ కపూర్ అదే చేశారు. ప్రస్తుతం ఆమె కథానాయికగా నటిస్తున్న ‘గుడ్‌లక్ జెర్రీ’ షూటింగ్ చంఢీఘర్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్ బ్రేక్‌లో యూనిట్ మెంబర్స్‌తో సరదాగా క్రికెట్ ఆడారామె. ‘‘ఆడటం మొదలుపెట్టిన కాసేటికే మంచి ప్లేయర్‌లా ఆడగలిగాను’’ అన్నారు జాన్వీ కపూర్. ఈ బ్యూటీ పెద్ద పెద్ద షాట్స్ కొడుతుంటే యూనిట్‌లో అందరూ ఆశ్చర్యపోయారట. ఇక ‘గుడ్‌లక్ జెర్రీ’ విషయానికొస్తే.. తమిళంలో నయనతార నటించిన ‘కోలమావు కోకిల’కి రీమేక్ ఇది. ఇందులో మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిగా నటిస్తున్నారామె. ఇది కాకుండా ‘దోస్తానా 2’ సినిమాలో నటిస్తున్నారు జాన్వీ కపూర్.
Comments
Please login to add a commentAdd a comment