‘కార్గిల్‌గాళ్‌’ విడుదల తేదీ ఖరారు | Janhvi Kapoor Annonce Gunjan Saxena Film To Release On August 12 | Sakshi
Sakshi News home page

‘కార్గిల్‌గాళ్‌’ విడుదల తేదీ ఖరారు

Published Thu, Jul 16 2020 12:42 PM | Last Updated on Thu, Jul 16 2020 12:55 PM

Janhvi Kapoor Annonce Gunjan Saxena Film To Release On August 12 - Sakshi

ముంబై: బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ నటించిన ‘గుంజన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గాళ్‌’ కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ఆగస్టు 12న నెట్‌ ఫ్లిక్స్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. ‘ఫస్ట్‌ ఇండియన్‌ ఫీమేల్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలెట్‌ గుంజన్‌ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావటం చాలా గర్వంగా ఉంది.ఆమె జీవితం నాకు చాలా స్ఫూర్తిని ఇచ్చింది. మీకు కూడా స్ఫూర్తిని కలిగిస్తుందని ఆశిస్తూన్నా. ‘గుంజన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గాళ్‌’ ఆగస్టు 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుంది’ అని కామెంట్‌ జత చేశారు. అదే విధంగా ఈ సినిమాకు సంబంధించిన మూడు మోషన్‌ పోస్టర్లను జాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. (నడిరోడ్డుపై డాన్స్‌ చేస్తా..!)

ఈ చిత్రం విడుదల తేదీ ఖరారుకు ముందు రోజు జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘గుంజన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గాళ్‌’ మూవీకి సంబంధించి ప్రత్యేకమైన ప్రయాణాన్ని మీ అందరితో పంచుకోవడానికి వేచి ఉండలేకపోతున్నా. ‌నా సస్పెన్స్‌కు నెట్‌ ఫ్లిక్స్ తొందరంగా ముగింపు ఇవ్వాలి’ అని కామెంట్‌ జతచేశారు. శరణ్‌ శర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశారు. ఈ సినిమాను చిత్ర బృందం మార్చి 13న విడుదల చేయాలనుకుంది. ఆ తర్వాత ఏప్రిల్‌ 24కు వాయిదా వేశారు. కరోనా వైరస్‌ కారణంగా థియేటర్లు మూతపడటంతో విడుదల సాధ్యపడలేదు. (హిందీకి హిట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement