అక్కినేని అఖిల్‌ గురించి వైరల్‌ అవుతున్న న్యూస్‌! | Akhil Akkineni Surgery News Viral | Sakshi
Sakshi News home page

Akhil Akkineni: అక్కినేని అఖిల్‌కు సర్జరీ..!

Published Sat, Oct 14 2023 1:31 PM | Last Updated on Sat, Oct 14 2023 1:43 PM

Akhil Akkineni Surgery News Viral - Sakshi

అఖిల్‌ అక్కినేని నటించిన 'ఏజెంట్‌'  చిత్రం తర్వాత ఆయన మళ్లీ కొత్త సినిమాను ప్రకటించలేదు. భారీ యాక్షన్‌, స్పై థ్రిల్లర్‌గా 'ఏజెంట్‌' తెరకెక్కింది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం అఖిల్‌ ఎంతో కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్‌తో కనిపించడం కోసం ఆయన కొన్నినెలలపాటు శ్రమించారు. కానీ ఏజెంట్‌ అంతగా ప్రేక్షకులను మెప్పించలేదు. ఎజెంట్‌ సినిమాలో అఖిల్‌ హాలీవుడ్‌ హీరోలకు ధీటుగా కనిపిస్తాడు. అతని ప్రధాన బలం హైట్‌, అందుకు తగ్గట్టు ఆయన మెయిన్‌టైన్‌ చేస్తున్న సిక్స్‌ ప్యాక్‌..  ఏజెంట్‌  స్క్రిప్టు పక్కాగా ఉండుంటే భారీ హిట్‌ అయిండేది. ఇదే విషయాన్ని ఆ చిత్ర నిర్మాత బహిరంగంగానే చెప్పాడు.

(ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ క్లిక్‌ చేసి ఫాలో అవ్వండి)

తాజాగా అక్కినేని అఖిల్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆయన ఓ కాస్మోటిక్ సర్జరీ చేయించుకుంటున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే హాలీవుడ్‌ హీరోలా ఉన్న అఖిల్ మరింత అందంగా కనిపించడానికి తన ముఖానికి స్వల్ప సర్జరీ చేయించుకుంటున్నారని సమాచారం. తన ముక్కుకు సంబంధించి కొన్ని మెరుగులు దిద్దుతున్నారట. దీనికోసం ఆయన విదేశాలకు వెళ్తున్నారని టాక్. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ వార్తలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

అఖిల్ ఏజెంట్ తర్వాత పక్కా ప్లాన్‌తో ఒక ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌. ఈ సినిమాకు అనిల్ కూమార్ అనే కొత్త దర్శకుడు డైరెక్షన్ చేయనున్నారని తెలుస్తోంది. అనిల్ గతంలో సాహో, రాధేశ్యామ్ వంటి పాన్‌ ఇండియా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు.  ఈ సినిమాకు ధీర అనే టైటిల్‌ కూడా సెలెక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ నటిస్తుందని వార్తల వస్తున్నాయి. ఆమె ప్రస్తుతం జూ.ఎన్టీఆర్‌ దేవర చిత్రంలో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement