ఎంతో నేర్చుకున్నా | Janhvi Kapoor posts her learnings from lockdown on social media | Sakshi
Sakshi News home page

ఎంతో నేర్చుకున్నా

Published Sat, Apr 4 2020 12:21 AM | Last Updated on Sat, Apr 4 2020 12:21 AM

Janhvi Kapoor posts her learnings from lockdown on social media - Sakshi

జాన్వీ కపూర్‌

‘‘లాక్‌ డౌన్‌లో ఉండి వారం అవుతోంది. ఈ సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. రోజూ తింటున్న ఆహారం విలువ తెలిసింది. తినడానికి కావాల్సినంత ఉండటం అదృష్టం అనే విషయం అర్థం చేసుకున్నాను. కానీ ఇంట్లో తినడానికి సరిగ్గా ఆహారంలేక ఎప్పటికప్పుడు కొనుగోలు చేయడానికి సాహసం చేసి బయటకు వెళ్తున్న వాళ్లను చూస్తుంటే ఏదో తెలియని బాధ. ఇలాంటివాళ్ల గురించి ఇన్ని రోజులూ ఆలోచించకుండా నేనెంత స్వార్థంతో, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించానో తెలుసుకున్నాను.

ప్రతిరోజూ మా నాన్నగారు మమ్మల్ని ఎంతగా మిస్‌ అవుతున్నారో తెలుసుకున్నాను. మా పనుల్లో మేము ఉండి ఇంటికి తిరిగొచ్చే సమయం వరకు మా కోసం ఆయన ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థమయింది. నా రోజువారీ జీవితం సాఫీగా సాగిపోవడానికి ఎంతమంది మీద ఆధారపడ్డానో అర్థమయింది. మా ఇంటికి నేను చాలా అవసరం అనే సంగతి గ్రహించాను. వాళ్లందరినీ బాధ్యతగా చూసుకోవాలని తెలుసుకున్నాను. వాళ్ల ఆరోగ్యమే నా ఆరోగ్యం అని తెలుసుకున్నాను’’ అని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు జాన్వీ కపూర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement