పుష్ప సిరీస్ గురించి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప2 భారీ కలెక్షన్స్ సాధించి ఎన్నో రికార్డ్స్‌ను దాటేసింది. పుష్ప రెండు భాగాలకు దేవిశ్రీ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ క్రమంలో ఆయన తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో 'పుష్ప 3' (Pushpa 3) ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. పుష్ప చిత్రాలకు ఐటెమ్ సాంగ్స్ మంచి గుర్తింపును ఇచ్చాయి. ఇప్పుడు పుష్ప3లో ఐటెమ్ సాంగ్‌లో ఎవరు కనిపిస్తే బాగుంటుందో దేవిశ్రీ ప్రసాద్ తాజాగా చెప్పారు.
(ఇదీ చదవండి: విజయ్‌తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష)
పుష్పలో సమంత 'ఊ అంటావా మామ.. ఉఊ అంటావా మామా' అంటూ తన గ్లామర్‌తో దుమ్మురేపింది. పుష్ప2లో శ్రీలీల కిస్సిక్ సాంగ్‌లో నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఈ ప్రత్యేకమైన సాంగ్స్ గురించి దేవిశ్రీ ప్రసాద్ ఇలా పంచుకున్నారు. పుష్ప 2 కిస్సిక్ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటారని తాము ముందే ఊహించామని అయన అన్నారు. అయితే, ఈ సాంగ్‌కు శ్రీలీల మంచి ఆప్షన్ అని తాను మేకర్స్‌కు ముందే చెప్పానని ఆయన అన్నారు.
దానికి ప్రధాన కారణం ఆమె చాలా బెటర్‌గా డ్యాన్స్ చేయడమేనని దేవిశ్రీ అన్నారు. ఇప్పటికే చాలామంది టాప్ హీరోయిన్లు తన మ్యూజిక్‌లో వచ్చిన ఐటెమ్ సాంగ్స్‌లో మెప్పించిన విషయాన్ని గుర్తుచేశారు. అందులో కాజల్ అగర్వాల్ (జనతా గ్యారేజ్), పూజా హెగ్డే( రంగస్థలం), సమంత (పుష్ప), శ్రీలీల (పుష్ప2)ఉన్నారన్నారు. వారందరూ కూడా కెరీర్‌లో మంచి పీక్‌లో ఉన్నప్పుడే ఐటెమ్ సాంగ్స్‌లలో కనిపించారన్నారు.
'పుష్ప 3' ఐటెమ్ సాంగ్‌లో జాన్వీ ఎంపిక ఎందుకంటే..?
పుష్ప 3 సినిమాలో ఐటెమ్ సాంగ్‌లో కనిపించేది ఎవరని ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయని ఆయన అన్నారు. ఈ అంశంపై దీనిపై దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. పాట ఆధారంగా హీరోయిన్‌ను ఎంపిక చేస్తారని దేవి తెలిపారు. ఇండస్ట్రీలో సాయి పల్లవి డ్యాన్స్‌కు తాను అభిమానినని చెప్పిన ఆయన.. జాన్వీ కపూర్(Janhvi Kapoor) కూడా మంచి డ్యాన్సర్ అని ఆయన తెలిపారు. ఇప్పటికే బాలీవుడ్‌లో నటించిన ఆమె పాటలు చూశానని అన్నారు. ఆమె అమ్మగారు అయిన శ్రీదేవిలో ఉన్న గ్రేస్ జాన్వీలో కూడా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, పుష్ప-3 ఐటెమ్ సాంగ్‌కు జాన్వీ అయితే సరైన ఎంపిక అని తాను అనుకుంటున్నట్లు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు.
‘పుష్ప 2’ ఘన విజయం అందుకున్న తర్వాత దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ పార్ట్ 3కి సంబంధించి నిరంతరం పని చేస్తున్నారని దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే చెప్పారు. ఆ స్టోరీపై రీవర్క్ కూడా చేస్తున్నారని ఆయన తెలిపారు. సుకుమార్ ఇచ్చిన మంచి స్క్రిప్టుకు అల్లు అర్జున్ అద్భుతంగా నటించడం వల్లే సినిమా భారీ హిట్ అయిందని ఆయన అన్నారు. పుష్ప 1, పుష్ప 2కి ఎలా పనిచేశామో ‘పుష్ప 3’కి అదే స్థాయిలో కష్టపడతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment