
జాన్వీ కపూర్
రెండుపదుల వయసు దాటి రెండేళ్లు దాటినా ఇప్పటికింకా తన వయసు నిండా పదేళ్లే అంటున్నారని నిట్టూరుస్తున్నారు యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్. ‘చాలా యంగ్ ఏజ్‌లో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ భావన మీకు ఎలా అనిపిస్తుంది?’ అన్న ప్రశ్నను జాన్వీ ముందు ఉంచితే... ‘‘ప్రాపర్ డైట్ అండ్ వర్కౌట్స్‌తో ఫిజికల్‌గా నేను బాగానే ఉన్నాను. కానీ మెంటల్‌గా కొంచెం స్ట్రాంగ్ కావాల్సి ఉంది. నేను మానసికంగా చాలా యంగ్‌గా ఉంటానని, పదేళ్ల వయసు ఉన్న అమ్మాయిలా ప్రవర్తిస్తానని కొందరు నాతో అంటుంటారు. అందుకే నేను మానసికంగా త్వరగా ఎదగాలి అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ‘రూహి అఫా’్జ అనే హారర్ మూవీలో రాజ్‌కుమార్ రావుతో కలిసి నటిస్తున్నారు జాన్వీ. అలాగే ‘కార్గిల్ గాళ్’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌లో కూడా నటిస్తున్నారామె. గత ఏడాది ‘ధడక్’ సినిమాతో ఆమె సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.