Janvi Kapoor Recreates Bigg Boss Viral Video: సినీ సెలబ్రిటీలు ఎప్పుడూ సినిమాలు చేస్తూ బిజీగా ఉండరు. సోషల్ మీడియాలో కూడా షూటింగ్‌లకు మించి యాక్టివ్‌గా ఉంటారు. తమదైనా రీతిలో పోస్ట్‌లు పెడుతూ అటెన్షన్ డ్రా చేస్తుంటారు. కొన్ని సార‍్లు అవి ప్రశంసలకు నోచుకుంటే మరికొన్ని సార్లు బెడిసికొట్టి ట్రోలింగ్‌కు గురవుతాయి. ఆ పోస్టులు, వీడియోలను నెటిజన్లు ఎలా తీసుకున్న సెలబ్రిటీలు పట్టించుకోరు. ప్రశంసలు, ట్రోలింగ్, నెటిజన్లను పక్కన పెడితే బాలీవుడ్ హీరోయిన్, అతిలోక సుందరీ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తాజాగా ఒక ఫన్ వీడియోను సామాజిక మాధ్యమంలో పంచుకుంది.
హిందీ బిగ్‌బాస్ సీజన్ 5లో జరిగిన 'పూజా, ఈ ప్రవర్తన ఏంటీ ?' అనే సంఘటనను రీక్రియేట్ చేసింది జాన్వీ. ఆ హౌజ్‌లో షొనాలీ నాగరాణి, పూజా మిశ్రాల మధ్య జరిగిన గొడవను జాన్వీ, తన మేకప్ ఆర్టిస్ట్ రివేరా లిన్‌తో కలిసి వీడియో చిత్రీకరించింది. పూజా మిశ్రా పాత్రను జాన‍్వీ చేయగా, షొనాలీ పాత్రలో రివేరా లిన్ నటించింది. వీడియోలో జాన్వీ తెల్లటి షార్ట్స్‌తో నీలిరంగు టాప్ ధరించి వస్తువును తన్నగా, అది లిన్‌కు తాకింది. అప్పుడు 'పూజా, ఈ ప్రవర్తన ఏంటీ?' అని లిన్ అనగా 'పొరపాటున తన్నాను' అని పూజా పాత్రలో ఉన్న జాన్వీ సమాధానం ఇచ్చింది. ఈ వీడియో షేర్ చేస్తూ 'నాకు సహాయం కావాలని మీరు అనుకుంటున్నారా ?' అని క్యాప్షన్ ఇచ్చింది దఢక్ హీరోయిన్.
జాన్వీ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే, హీరో-సోదరుడు అర్జున్ కపూర్ 'అవును' అని బదులిచ్చాడు. తర‍్వాత జాన్వీ కజిన్ షానాయ కపూర్ 'నేను నీకోసం పార్థిస్తున్నాను' అని కామెంట్ చేసింది. అలాగే సన్నీ కౌశల్, ఫాతిమా సనా షేక్ తదితరులతో సహా బీటౌన్ ప్రముఖులు ఈ వీడియోపై స్పందించారు. జాన్వీ కపూర్ ప్రస‍్తుతం కరణ్ జోహార్ నిర్మిస్తున్న 'దోస్తానా 2', ఆనంద్ ఎల్ రాయ్ 'గుడ్ లక్ జెర్రీ' సినిమాల్లో నటిస్తుంది.
ఇదీ చదవండి: న్యూడ్‌గా కనిపించి షాకిచ్చిన జాన్వీ కపూర్.. ఫోటో వైరల్
Comments
Please login to add a commentAdd a comment