
జాన్వీ కపూర్; జాన్వీ కపూర్- ఖుషీ
‘బయట అందరికీ నేను ‘ధడక్’లో హీరోయిన్‌ని కావచ్చు. సెలబ్రిటీ కావచ్చు. కానీ ఎప్పుడూ నన్ను నాలానే ఉంచే వ్యక్తి నా చెల్లెలు ఖుషి’’ అంటున్నారు జాన్వీ కపూర్. ఖుషీతో ఉన్న రిలేషన్‌షిప్ గురించి జాన్వీ మాట్లాడుతూ– ‘‘సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ మధ్య మేం కలసి ఉండటం చాలా తక్కువ అవుతోంది. తను నన్ను కలవడానికి వచ్చినా నేనేదో నా పనుల్లో బిజీగా ఉంటున్నాను. అది కొంచెం బాధగా అనిపిస్తోంది. సినిమా ప్రమోషన్స్, ఈవెంట్స్ అన్నింట్లో ‘స్పెషల్ ట్రీట్‌మెంట్’ ఉంటుంది.
ఇంటి బయట నా స్టేటస్ ఇది అయితే ఇంట్లో మాత్రం సాదాసీదా అమ్మాయినే. ఎందుకంటే స్టార్ ఫీలింగ్‌ని నాలోకి రాకుండా చేస్తుంది ఖుషి. నన్ను భూమ్మీదే ఉంచుతుంది (నవ్వుతూ). ఇప్పటికీ నన్ను ఏడిపిస్తూనే ఉంటుంది. ‘నువ్వు చాలా కూల్ అనుకుంటావు కానీ అంతేం కాదు’ అంటూ సరదాగా ఆటపట్టిస్తుంది. నాతో అన్ని పనులు చేయించుకుంటుంది. టీవీలో మేం ఏం చూడాలో తనే డిసైడ్ చేస్తుంది. అందుకే ఖుషి అంటే నాకు బోలెడంత ఇష్టం. నా చెల్లి అనడంకంటే ఖుషీని అక్క అనాలేమో?’’ అని చెల్లెలి గురించి చాలా కబుర్లు చెప్పారు జాన్వీ.
Comments
Please login to add a commentAdd a comment