సివలపేరిపాండి సీక్వెల్‌లో కమల్? | Kamal Haasan and Gautham Menon team up for a sequel? | Sakshi
Sakshi News home page

సివలపేరిపాండి సీక్వెల్‌లో కమల్?

Published Thu, Nov 19 2015 3:19 AM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

సివలపేరిపాండి సీక్వెల్‌లో కమల్?

సివలపేరిపాండి సీక్వెల్‌లో కమల్?

సివలపేరిపాండి చిత్రం రెండో భాగంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించనున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. తూంగావనం చిత్రం దీపావళికి విడుదలై మంచి విజయం అందుకుంది. ఆ విశ్వనటుడి తదుపరి చిత్రం ఏమిటన్న విషయం గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది. తాజాగా సివలపేరిపాండి చిత్రానికి సీక్వెల్‌లో నటించడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. సివలపేరిపాండి చిత్రం గురించి చెప్పాలంటే 20 ఏళ్లు వెనక్క వెళ్లాలి.

ఇది తమిళనాడు తిరునెల్వేలి జిల్లాలోని సివలపేరి అనే ఊరిపై ఎనలేని ప్రేమ కలిగిన పాండి అనే వ్యక్తి ఇతివృత్తం అది. యథార్థ కథ ఆధారంగా రూపొందిన చిత్రం సివలపేరిపాండి. 1994లో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. నటుడు నెపోలియన్ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ఇది. ప్రతాప్‌పోతన్ దర్శకుడు. ఆ చిత్రాన్ని నిర్మించిన పీజీ.శీకాంత్ ఇప్పుడు దానికి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇందులో కమలహాసన్ కథానాయకుడిగా నటించనున్నట్లు కోడంబాక్కమ్ టాక్. దీనికి గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహించనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు కమలహాసన్, గౌతమ్‌మీనన్ కాంబినేషన్‌లో వేట్టైయాడు విళైయాడు అనే సక్సెస్‌ఫుల్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఇదే నిజం అయితే సుమారు దశాబ్దం తర్వాత మళ్లీ వీరి కలయికలో ఒక యాక్షన్ చిత్రం తెరకెక్కే అవకాశముందన్న మాట.
 
హాస్యభరిత కథా చిత్రం
కమలహాసన్ తదుపరి చిత్రం గురించి మరో ప్రచారం కూడా జరుగుతోం ది. తూంగావనం తర్వాత కమలహాసన్ పూర్తి వినోదభరిత కథా చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారని, ఆ చిత్రానికి ఆయనే స్క్రీన్‌ప్లే రాస్తున్నారని, ఈ చిత్రాన్ని తన రాజకమల్ ఇంటర్నేషనల్ సంస్థలో నిర్మించనున్నార ని ప్రచారం జరుగుతోంది. తమిళం, తెలుగు, మలయాళం, హింది తదితర నాలుగు భాషలలో రూపొందించనున్న ఈ చిత్రానికి రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.

జనవరిలో అమెరికాలోని న్యూ యార్క్ నగరం లో చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని టాక్ వినిపిస్తోం ది. ఇది అవ్వైషణ్ముఖి, పంచతంత్రం చిత్రాల తరహాలో వినోదంతో కూడి న సమాజానికి కావాల్సిన మంచి సందేశంతో ఊడి ఉంటుం దని కోలీవుడ్ వ ర్గాల సమాచారం. కమల్ తదుపరి చిత్రం ఏమిటన్నది త్వరలోనే ఒక ప్రకటన అధికారపూర్వకంగా వెలువడే అవకాశం ఉందని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement