
హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయం ప్రజా విజయమని నటుడు, వైఎస్సార్‌సీపీ నేత పృథ్వీరాజ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మరో సినీ నటుడు కృష్ణుడు తదితరులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏడాదిన్నర క్రితమే జగన్‌కు ఓటేయాలని నిర్ణయించుకున్నారని, ఆయన అయితేనే సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయని భావించారని తెలిపారు.
పాదయాత్ర మొదలైన రోజే వైఎస్ జగన్ విజయం ఖాయమయ్యిందన్నారు. ఆయన ఘన విజయంలో సముద్రంలో ఇసుక రేణువులా తన పాత్ర కూడా ఉండడం సంతోషమన్నారు. జగన్ మంచి ముఖ్యమంత్రిగా తప్పక పేరు తెచ్చుకుంటారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment