ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నటుడు పృథ్వీ విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ పంచె లాక్కెళ్లి చంద్రబాబు రాహుల్ గాంధీకి కప్పారని వ్యాఖ్యానించారు. తన స్వార్థం కోసం నందమూరి సుహాసినిని బాబు బలిపశువుని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్ గాలి 30 ఏళ్ల పాటు ప్రజలకు అందాలని ఆకాక్షించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆయన పాల్గొన్నారు.