
చేయని తప్పుకు నిందలు పడటం ఎవరికైనా కష్టమే! అవతలివారిపై నోరుజారకుండా ఆచితూచి మాట్లాడే నిఖిల్.. అమ్మాయిలను గేమ్ కోసం వాడుకుంటాడని సీత పెద్ద నిందేసి వెళ్లిపోయింది. ఆ మాటను నిఖిల్ జీర్ణించుకోలేకపోతున్నాడు. తాను అలాంటి వ్యక్తిని కాదని కెమెరాలకు గోడు వెల్లబోసుకున్నాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 20) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..

నిఖిల్‌కు సారీ చెప్పిన యష్మి
ఆడవాళ్లను ట్రాప్ చేస్తున్నావ్.. ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నావ్ అని సీత ఇచ్చిన స్టేట్‌మెంట్ విని ప్రేక్షకులే కాదు హౌస్‌మేట్స్ కూడా షాకయ్యారు. తనవల్లే అలాంటి నిందలు వచ్చాయంటూ నిఖిల్‌కు యష్మి సారీ చెప్పింది. నా వల్లే ఇదంతా మొదలైంది.. మన ఇద్దరి గేమ్ పాడవుతుందంటే మనం మాట్లాడకుండా ఉండటమే నయమని చెప్పుకొచ్చింది. తర్వాత ఒంటరిగా కూర్చున్న నిఖిల్ బిగ్‌బాస్‌కు తన గోడు చెప్పుకున్నాడు.

నాకు ఓటు వేయకండి: నిఖిల్
ఒకర్ని తొక్కి ఆడాలని ఎన్నడూ అనుకోలేదు. నామినేషన్స్‌లో సీత చెప్పినట్లు స్ట్రాంగ్ మహిళల్ని అడ్డుపెట్టుకుని గేమ్‌లో గెలవాలనుకోలేదు. మనసుకు ఏమనిపిస్తే అదే చేశాను. ఎవర్నీ తొక్కాలనుకోలేదు. ఈ వారం నామినేషన్‌లో ఉన్నాను, హౌస్ నుంచి వెళ్లిపోవాలనిపిస్తోంది. ఇక్కడ నా ప్రయాణం అయిపోయింది. దయచేసి ప్రేక్షకులు ఎవరూ నాకు ఓటు వేయకండి.. నన్ను ఎలిమినేట్ చేయండి అని కోరుకున్నాడు.

వెళ్లిపోతా అన్నందుకు క్షమించండి
మరికాసేపట్లోనే మనసు మార్చుకుని.. నేనేంటో నిరూపించుకున్నాకే బయటకు వస్తాను. వెళ్లిపోతా అన్నందుకు క్షమించండి. కప్పు తీసుకునే బయటకు వస్తా అని తనకు తాను ధైర్యం చెప్పుకుని కెమెరాలతో మాట్లాడాడు. తర్వాత హౌస్‌మేట్స్ అందరూ సమావేశమై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ప్రేరణ.. ఎవరినైనా బాధపెట్టుంటే క్షమించమని కోరుతూ ఏడ్చేసింది.

అది నా వ్యక్తిత్వం కాదు
యష్మి మాట్లాడుతూ.. నిఖిల్ గేమ్‌కోసం అమ్మాయిలను వాడుకోలేదు అని క్లారిటీ ఇచ్చింది. నిఖిల్ మాట్లాడుతూ.. నన్ను తప్పు అని నిందవేసినచోటే నేనేంటో నిరూపించుకోవాలనుకుంటున్నాను. ఒకర్ని వాడుకుని గేమ్ ఆడే వ్యక్తిత్వం నాది కాదు అని తెలిపాడు. అనంతరం తేజ నిద్రపోయినందుకు చీఫ్ అవినాష్ పనిష్మెంట్ ఇచ్చాడు. షర్ట్ తీసేసి స్విమ్మింగ్ పూల్‌లో 10 సార్లు దూకాలన్నాడు. ఈ టాస్క్ పూర్తి చేస్తే యష్మి.. తేజకు ముద్దుపెడతానంది.

ముద్దు కోసం తేజ ఆశ
ఆశతో పూల్‌లో పదిసార్లు మునకేసిన తేజను కళ్లుమూసుకోమని పక్కనే నిలబడింది యష్మి. తీరా నిఖిల్ వచ్చి తేజ చెంపపై ముద్దుపెట్టాడు. ఆ విషయం తెలియని తేజ కుప్పిగంతులు వేశాడు. నీకంత సినిమాలేదు, నీకు కిస్ పెట్టింది నిఖిల్ అని నబీల్ అసలు విషయం బయటపెట్టాడు. అనంతరం ఈ సీజన్‌కే ఆఖరి మెగా చీఫ్ పోస్టును ప్రకటించాడు బిగ్‌బాస్. సమయానుసారం ఒక్కొక్కరి పేరుతో టీషర్ట్స్ గార్డెన్ ఏరియాలో వేస్తుంటాడు.

మెగా చీఫ్ ఎవరంటే?
ఆ టీషర్ట్‌ను చించకుండా భద్రంగా కాపాడుకున్నవారు కంటెండర్లవుతారు. అలా ఈ గేమ్‌లో ప్రేరణ, గౌతమ్, అవినాష్, నబీల్ ఓడిపోగా.. పృథ్వీ, తేజ, యష్మి, విష్ణుప్రియ కంటెండర్లయ్యారు. చివర్లో నిఖిల్, రోహిణి మాత్రమే మిగలగా.. వీరిలో ఎవరు కంటెండర్ అవ్వాలనేది హౌస్‌మేట్స్ నిర్ణయించాలన్నాడు. అంతటితో ఎపిసోడ్ ముగిసింది. అయితే రోహిణిని కంటెండర్ చేయగా చివరకు ఆవిడే మెగా చీఫ్ అయినట్లు తెలుస్తోంది.



Comments
Please login to add a commentAdd a comment