
హౌస్‌మేట్స్ తమ మొదటి ప్రేమకథ చెప్పాలన్నాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో ఫస్ట్ లవ్‌స్టోరీ చెప్తూ కొందరు సిగ్గుపడితే మరికొందరు ఎమోషనలయ్యారు. ముందుగా యష్మి మాట్లాడుతూ.. నేను టీవీ యాంకర్‌గా ట్రై చేసినప్పుడు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మొదట ఫ్రెండయ్యాడు.. తర్వాత ప్రేమించుకున్నాం. కానీ ఒకానొక సమయంలో నాకు ఫ్యామిలీనే ముఖ్యమనిపించింది. అప్పుడు మా మధ్య కూడా విభేదాలు వచ్చాయి.

ఒప్పుకోలేకపోతున్నా..
ప్రేమ మీద నమ్మకం పోయింది. మా నాన్న తప్ప ఇంకెవరూ వద్దనుకున్నాను. కానీ ఈరోజుకూ ఆయన నాకోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎందుకో ఆయన్ను ఒప్పుకోలేకపోతున్నాను. కానీ ఈరోజుకూ నన్ను గైడ్ చేస్తూ ఫ్రెండ్‌గా ఉన్నాడు. మరో జన్మంటూ ఉంటే అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను.. అని యష్మి భావోద్వేగానికి లోనైంది.

బాగోలేనని బ్రేకప్: తేజ
తేజ మాట్లాడుతూ.. నాలుగేళ్లపాటు రిలేషన్‌లో ఉన్నాం. ఓసారి ఇంటికెళ్లి రాగానే బ్రేకప్ చెప్పింది. తన పక్కన నేను బాగోలేనని వాళ్ల పేరెంట్స్ వద్దన్నారట! ఆమె పెళ్లికి కూడా వెళ్లాను. ఓసారి ఆమె సడన్‌గా కాల్ చేసి సారీ అంటూ ఏడ్చేసింది. నా లైఫ్‌లోకి వచ్చే అమ్మాయికి ఒకటే చెప్తున్నా.. మా అమ్మను ఎంత ప్రేమగా చూసుకుంటానో, తనను కూడా అంతే ప్రేమగా చూసుకుంటా అని బిగ్‌బాస్ షో సాక్షిగా మాటిచ్చాడు.

పృథ్వీ లవ్ స్టోరీ
పృథ్వీ.. నేను, నా బెస్ట్ ఫ్రెండ్ ఒకే అమ్మాయిని ప్రేమించాం. ఇద్దరం ట్రై చేసుకుందాం, ఎవరికి పడితే వాళ్లకే ఆ అమ్మాయి సొంతం అని డీల్ మాట్లాడుకున్నాం. ఓసారి ఆమె దగ్గరకు వెళ్లి ఐ లవ్యూ చెప్తే నీ పేరేంటి? అని అడిగింది. కాలేజీలో నా పేరు అందరికీ తెలుసు.. అలాంటిది ఆమె నా పేరు అడిగేసరికి ఇన్సల్ట్ అనిపించింది. తర్వాత ఆమె నా ఫ్రెండ్స్ దగ్గర నెంబర్ తీసుకుని నాకు మెసేజ్‌లు చేసింది.

మోసం చేశాడు: రోహిణి
ఓరోజు ప్రపోజ్ కూడా చేసింది. అంతా బాగానే సాగింది. త్వరగా పెళ్లి చేసుకుందామంది. నా కెరీర్ నాకు ముఖ్యం, పెళ్లికి సమయం పడుతుందని చెప్పేసరికి ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం అని తెలిపాడు. రోహిణి.. డైమండ్ రింగ్‌తో నాకు బాగా దగ్గరైన స్నేహితుడికి ప్రపోజ్ చేశాను. ఆర్థిక ఇబ్బందులున్నాయి. అవి క్లియర్ అయ్యాకే పెళ్లి చేసుకుందామన్నాడు. సరేనన్నాను. కట్ చేస్తే వేరే అమ్మాయితో రెండేళ్లుగా రిలేషన్‌లో ఉన్నాడు. అది నా దగ్గర దాచాడు. తర్వాత సిల్లీగా బ్రేకప్ చెప్పాడు అంటూ ఎమోషనలైంది.

నా భార్య అని ఫిక్సయ్యా: నిఖిల్
నిఖిల్ వంతు రాగా.. తెలుగు ఇండస్ట్రీలో కాలు పెట్టినప్పుడే ఈ అమ్మాయి నా సొంతం అనిపించింది. అన్ని ప్రేమకథల్ని మరిపించేలా చేసింది. మాది ఆరేళ్ల రిలేషన్.. తను నా భార్య అని ఫిక్సయిపోయాను. కానీ ఫ్యామిలీ వల్ల మా మధ్య దూరం వచ్చింది. ఈ జన్మకు సరిపోయేటన్ని జ్ఞాపకాలనిచ్చింది.

తిట్టు, కొట్టు..
కోపంలో విడిపోయాం.. కానీ నా వల్ల కావట్లేదు. కచ్చితంగా తన దగ్గరకు వెళ్తా.. తిట్టు, కొట్టు, నువ్వు మళ్లీ ఒప్పుకునేవరకు నీ వెంటపడ్తాను. నాకు పిచ్చి లేసిందంటే మాత్రం లేపుకెళ్తాను. బిగ్‌బాస్ షో అయిపోగానే నీ కళ్ల ముందుంటాను. బిడ్డ తప్పు చేస్తే అమ్మ ఎలా క్షమించి దగ్గరకు తీసుకుంటుందో నువ్వూ అలాగే దగ్గరకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు నువ్వు కావాలి అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment