కూరలో కరివేపాకులా మణికంఠ.. యష్మి, నిఖిల్‌ చిన్నచూపు! | Bigg Boss 8 Telugu Sep 25th Full Episode Review And Highlights: Challenges For Contestants To Stop Wild Card Entries | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu Day 24 Highlights: మగవాడే కాదంటూ మణిపై సెటైర్లు! యష్మి గేమ్‌ ప్లాన్‌ అదేనా?

Published Wed, Sep 25 2024 11:50 PM | Last Updated on Thu, Sep 26 2024 10:51 AM

BIgg Boss Telugu 8, Sep 25th Full Episode Review: Challenges for Stop Wild Card Entries

హౌస్‌ అంతా ఒకవైపు.. నిఖిల్‌, సోనియా, పృథ్వీ ఒకవైపు.. ఎవరూ తన టీమ్‌లోకి రావడానికి ఆస​క్తి చూపించకపోవడంతో నిఖిల్‌ షాక్‌ తిన్నాడు. కానీ దాని ద్వారా నేర్చుకుందేమైనా ఉందా? అంటే జీరో! అందరితో బాగానే ఉండే నిఖిల్‌ తనకు తానే ఏదేదో ఊహించుకుంటున్నాడు. ఇంతకీ ఏం జరిగింది? అనేది తెలియాలంటే నేటి (సెప్టెంబర్‌ 25) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేయండి..

జీవించేసిన మణికంఠ
మణికంఠ ఎమోషన్స్‌తో ఓ స్కిట్‌ వేయించింది సోనియా. నీ కూతుర్ని చాలా మిస్‌ అవుతున్నావు. తనను నీ దగ్గరికి రమ్మని ఎలా పిలుస్తావో యాక్టింగ్‌ చేయమని మణికంఠకు ఆర్డర్‌ వేసింది. అందుకాయన కూతుర్ని తలుచుకుని రా బంగారుతల్లి అంటూ కంటనీరుపెట్టుకుని ఏడుస్తూ జీవించేశాడు. అతడి యాక్టింగ్‌కు అందరూ చప్పట్లు కొట్టారు.

ఆదిలోనే హంసపాదు
ఇకపోతే శక్తి (నిఖిల్‌), కాంతార(సీత) టీమ్స్‌లో దేనికి వెళ్తారో సెలక్ట్‌ చేసుకోమని బిగ్‌బాస్‌ చెప్పాడు. సోనియా, పృథ్వీ తప్ప విష్ణు, నైనిక, నబీల్‌, ఆదిత్య, యష్మి.. నలుగురూ కాంతార టీమ్‌నే ఎంచుకున్నారు. దీంతో చివర్లో ప్రేరణ, నాగమణికంఠ మాత్రమే మిగిలారు. వీళ్లకు సైతం కాంతార టీమ్‌కే వెళ్లాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు. కానీ మరో ఆప్షన్‌ లేకపోవడంతో శక్తి టీమ్‌లోకి వెళ్తున్నానని నాగమణికంఠ అన్నాడు.

ప్రేరణ కోసం యష్మి త్యాగం
ప్రేరణ.. తనకు బదులుగా ఎవరైనా శక్తి టీమ్‌కు వెళ్లమని కోరడంతో యష్మి ముందుకు వచ్చింది. తాను ఎక్కడున్నా గేమ్‌ ఆడతానంటూ లేచి నిలబడింది. అలా శక్తి టీమ్‌లో నిఖిల్‌, పృథ్వీ,సోనియా, యష్మి, మణికంఠ చేరారు. తన టీమ్‌లోకి రావడానికి ఎవరూ ఇష్టపడటం లేదు, ఇప్పుడైనా ఇది నిఖిల్‌కు అర్థం అయితే బాగుండు అని సీత ఫీలైంది. కానీ నిఖిల్‌కు ఇదంతా మరోలా అర్థమైంది. హౌస్‌ అంతా ఒక్కటైందని, వాళ్లందరితో మనం ముగ్గురం ఫైట్‌ చేయాలని సోనియా, పృథ్వీకి నూరి పోస్తున్నాడు. తన టీమ్‌కు వచ్చిన యష్మి కూడా మనసులో ఏదో దురుద్దేశంతోనే వచ్చిందని ఊహించుకున్నాడు.

12 వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీస్‌
తర్వాత బిగ్‌బాస్‌ ఓ పెద్ద భూకంపం రాబోతుందని ట్విస్ట్‌ ఇచ్చాడు. మిమ్మల్నే సవాలు చేస్తూ కొందరు ఇంట్లోకి రాబోతున్నారని సర్‌ప్రైజ్‌ చేశాడు. ఒకటీరెండు కాదు ఏకంగా 12 వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు ఉండబోతున్నాయన్నాడు. అయితే ఈ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలను ఆపే పవర్‌ ఇంటిసభ్యులకు ఇచ్చాడు. తాను ఇచ్చే ఛాలెంజ్‌ గెలిచిన ప్రతిసారి ఒక వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీని ఆపొచ్చని తెలిపాడు. అలాగే గెలిచే ప్రతి టీమ్‌ తరపు నుంచి ప్రైజ్‌మనీలోకి రూ.1 లక్ష జమ అవుతాయని పేర్కొన్నాడు.

మణికంఠపై కుళ్లు జోకులు
వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు అని చెప్పగానే మణికంఠ భయంతో వణికిపోయినట్లున్నాడు. ఒంటరిగా దిగాలుగా కూర్చున్నాడు. అలాంటి సమయంలో 'అబ్బాయిలెంతమంది ఉన్నాం? నలుగురుమా? అ‍య్యో మణిని లెక్కపెట్టాలిగా' అని పృథ్వీ అంటే అందుకు యష్మి కౌంట్‌ లేదు అనేసింది. dwgsy నిఖిల్‌ దీన్ని పెద్దది చేశాడు. నిన్ను అబ్బాయిల లిస్టులోనే తీసేశారంటూ మసాలా జోడించాడు.

వార్నింగ్‌!
తను అబ్బాయే కాడంటూ జోకులు వేయడంతో కంటెస్టెంట్లపై ఫైర్‌ అయ్యాడు. ఇంకోసారి ఇలా చేస్తే బాగోదని వార్నింగ్‌ ఇచ్చాడు. ఇక వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలను ఆపేందుకు బిగ్‌బాస్‌ ఇచ్చిన ఫస్ట్‌ ఛాలెంజ్‌ బాల్‌ పట్టు- టవర్‌లో పెట్టు. ఈ గేమ్‌లో కాంతార టీమ్‌ గెలవడంతో సభ్యులు ఎగిరి గంతేశారు. వీరు రూ.1 లక్ష గెలవడంతో పాటు ఒక వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీని హౌస్‌లో అడుగుపెట్టకుండా చేశారు.

నిఖిల్‌ అనుకున్నదే వేరు
ఓడిన టీమ్‌లో ఒకర్ని ఆటలో నుంచి తీసేయాలని బిగ్‌బాస్‌ చెప్పాడు. నిఖిల్‌ మినహా అందరూ తన పేరే చెప్పడంతో పక్కకు తప్పుకునేందుకు మణి అంగీకరించాడు. అయితే నిఖిల్‌ మనసులో మాత్రం మరొకరి పేరు ఉందట! యష్మిని పక్కన పెట్టేదామనుకున్నానని, ఇంతలో మణి స్వయంగా సైడ్‌ అయ్యాడని సోనియాతో వాపోయాడు. ఎలాగో ఈ వారం నామినేషన్స్‌లో కూడా లేదు కదా! పైగా మన తప్పులు వెతకడానికే ఆమె ఈ టీమ్‌లోకి వచ్చిందని అభిప్రాయపడ్డాడు.

బిర్యానీ ఛాలెంజ్‌
ఇంతలో బిగ్‌బాస్‌ బిర్యానీ ఛాలెంజ్‌ ఇచ్చాడు. ఈ గేమ్‌లో తాను ఆడతానని యష్మి ముందుకు రాగా.. నిఖిల్‌ తనను పక్కనపెట్టి సోనియాను సెలక్ట్‌ చేశాడు. కాంతార టీమ్‌ నుంచి నబీల్‌ విందు ఆరగించాడు. ఎంత కష్టపడ్డా బిర్యానీ ఖాళీ అవట్లేదని గ్రహించిన బిగ్‌బాస్‌ వీరికి తోడుగా మరో ఇద్దరు వెళ్లొచ్చన్నాడు. అలా యష్మి, ఆదిత్యను పంపించారు. అయినప్పటికీ మహాథాళిని 40 నిమిషాల్లో పూర్తి చేయకపోవడంతో రెండు టీమ్స్‌ ఓడిపోయాయని బిగ్‌బాస్‌ తెలిపాడు. అయితే మిగిలిన బిర్యానీని ఎవరైనా తినొచ్చనడంతో మిగతావాళ్లు ఎగబడి మరీ ఎంగిలి ఫుడ్‌ ఆవురావురుమని ఆరగించారు.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడక క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement