బిగ్‌బాస్ షో రోజురోజుకీ రంజుగా మారుతోంది. ఫస్ట్ వీక్‌లోనే కంటెస్టెంట్లు తమ సత్తా ఏంటో చూపించారు. ఎవరికి ఏయే కళల్లో ప్రావీణ్యం ఉందో బయటపెట్టారు. ఒక్క టాస్కుల్లోనే ఇంకా అందరి బలం బయటపడలేదు. ఫస్ట్ వీక్ బేబక్క ఎలిమినేషన్‌తో హౌస్ కాస్త నిశ్శబ్ధంగా మారింది. ఈ సైలైన్స్ నాకు నచ్చదన్నట్లుగా బిగ్‌బాస్ వెంటనే రెండోవారం నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టాడు.
ఆ హక్కు లేదు
ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్నామన్నట్లుగా కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఓ ప్రోమో విడుదలైంది. బయట ఆల్‌రెడీ ఉన్న ఫ్రెండ్‌షిప్‌ను మీరు ఇంట్లో ఫాలో అవండి, కానీ పక్కవాళ్లు కూడా ఫాలో అవాలని చెప్పే హక్కు నీకు లేదంటూ ప్రేరణను నామినేట్ చేసింది సీత.
మెచ్యూరిటీ రావాలి!
ఈ సమయంలో వీరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. సోనియా.. నీకు పర్సనాలిటీ ప్రాబ్లమ్ ఉంది, నీకింకా మెచ్యూరిటీ రావాలని సూక్తులు చెప్పడంతో సీతకు మండిపోయింది. నాకెంత క్లారిటీ ఉందో నాకు తెలుసు, ముందు నువ్వు గేమ్‌ను అర్థం చేసుకుని నాకు వివరించు, అసలు నీకు క్లారిటీ లేదు.. అని ఇచ్చిపడేసింది.
నామినేషన్‌లో..
దీంతో సోనియా.. ఎక్కువ మాట్లాడొద్దు, పిచ్చి మాటలు మాట్లాడకు అని సీరియస్ అయింది. మొత్తానికి ఈ వారం నిఖిల్, నైనిక, సీత, మణికంఠ, శేఖర్ బాషా, ఆదిత్య, పృథ్వీ, విష్ణుప్రియ నామినేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment