బిగ్‌బాస్ 8 ప్రారంభమైన తొలినాళ్లలో సోనియా.. తన తెలివిని ఉపయోగించి ఆటలో ముందుకు సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె అతి తెలివి ఉపయోగించడం వల్ల మొదటికే మోసం వచ్చింది. గ్రూప్ గేమ్ అంటూ నిఖిల్, యష్మిలపై నింద వేసిన ఆమె ఇప్పుడు నిఖిల్‌ను తన గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పుతోంది. ఇది చూసిన జనాలు సోనియాకు నిందించకుండా ఎలా ఉంటారు?
గ్రూప్ గేమ్
పైగా ఫైర్ బ్రాండ్‌లా ఉండే నిఖిల్.. సోనియా చెంత చేరాక ఆమె చేతిలో కీలుబొమ్మలా మారాడు. ఇక సోనియాను ఎవరైనా ఏమైనా అంటే చాలు నిఖిల్, పృథ్వి.. వారి మీద పడిపోయేవారు. ఈ ఇద్దరిని అడ్డం పెట్టుకుని గేమ్ ఆడే సోనియా.. నామినేషన్‌లోనూ యష్మి.. ఆ ఇద్దరు అబ్బాయిలనే చూస్తోందని చులకనగా మాట్లాడింది. ఈ గ్రూప్ గేమ్‌ను చూసీచూడనట్లు ఊరుకున్న నాగ్ ఇన్నాళ్లకు పెదవి విప్పాడు.
సోనియా ఆట కూడా చెడగొట్టండి
తాజా ప్రోమోలో.. నీ ఆట కనిపించడం లేదంటూ యష్మి సోనియాను నామినేట్ చేసింది. ఆ సమయంలో నిఖిల్, పృథ్వి పేర్లు ఎందుకు బయటకు వచ్చాయి? అని నాగ్ సూటిగా ప్రశ్నించాడు. ఇక్కడ పృథ్వీ సోనియాను వెనకేసుకురాబోయాడు. కానీ నాగ్ అందుకు ఒప్పుకోలేదు. ఇలాగే ఏం అర్థం చేసుకోకుండా మీ ఆటను పాడు చేసుకోండి.. అలాగే సోనియా ఆట కూడా చెడగొట్టండని క్లాస్ పీకాడు.
బొట్టు ఒక్కటే తక్కువ
ఇక బిగ్‌బాస్ షోకు పిక్నిక్ కోసమే వచ్చిన విష్ణుప్రియ.. నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టు ఒక్కటే తక్కువయ్యాయంటూ హేళన చేయడాన్ని సైతం తప్పుపట్టాడు. ఇది చాలా తప్పని నాగ్ చెప్తున్నా సరే విష్ణు దాన్ని నెత్తినెక్కించుకోకుండా ఊరికే నిఖిల్‌ను కాంచన అని ఆటపట్టిస్తామని కవర్ చేసేందుకు ప్రయత్నించింది. ఇది జోక్ కాదని, అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావని గద్దించడంతో అప్పుడు తన గొంతు తగ్గించింది. మరి ఇప్పటికైనా విష్ణు తన నోటిని అదుపులో పెట్టుకుంటుందేమో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment