హీరో నుంచి జీరో స్థాయికి పడిపోయిన నిఖిల్‌.. క్లాస్‌ పీకిన నాగ్‌ | Bigg Boss Telugu 8 Promo: Hero or Zero Game in BB House | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: హౌస్‌ అందరూ రిజెక్ట్‌ చేశారంటే అర్థమేంటి? నిఖిల్‌కు నాగ్‌ సూటి ప్రశ్న

Published Sat, Sep 28 2024 5:24 PM | Last Updated on Sat, Sep 28 2024 6:22 PM

Bigg Boss Telugu 8 Promo: Hero or Zero Game in BB House

బిగ్‌బాస్‌ ప్రోమో రానే వచ్చింది.. కింగ్‌ నాగార్జున ఇంటిసభ్యులతో హీరో- జీరో గేమ్‌ ఆడించాడు. అంటే హౌస్‌లో మీకు హీరోగా కనిపించిన వ్యక్తికి రాజకిరీటం పెట్టమని.. ఆటలో జీరో అనిపించిన వ్యక్తి ముఖంపై రాంగ్‌ సింబల్‌ అచ్చు దింపాలని ఆదేశించాడు. అలా ఎక్కువమంది నబీల్‌, నిఖిల్‌, సీత హీరో అని అభిప్రాయపడగా నైనిక, మణికంఠను ఎక్కువమంది జీరో అని తేల్చేశారు.

కేవలం శక్తి టీమ్‌ విజయం కోసం
ఈ క్రమంలో ప్రేరణ.. నిఖిల్‌కు జీరో ట్యాగ్‌ ఇచ్చింది. అందుకు బలమైన పాయింట్‌ కూడా చెప్పింది. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలను ఆపడానికి హౌస్‌ అంతా కలిసి ఆడదామన్నాడు. కానీ చివరికి తన టీమ్‌ కోసం హౌస్‌ను పక్కనపడేశాడంది. అందుకు నాగార్జున సైతం తనకూ అలాగే అనిపించిందన్నాడు. నబీల్‌ను గేమ్‌లో నుంచి తీసేయడం కరెక్టేనా? అని అడగ్గా.. అందుకు నిఖిల్‌ ఎక్కడో మిస్‌ బ్యాలెన్స్‌ అయిందన్నాడు. బ్యాలెన్స్‌ తప్పడానికి ఏ మిస్‌ కారణం? అని నిలదీయడంతో నిఖిల్‌ బిక్కముఖం వేశాడు.

ఒక్కసారైనా ఆలోచించావా? 
నువ్వు క్లాన్‌ చీఫ్‌ (టీమ్‌ లీడర్‌)గా ఉన్నప్పుడు హౌస్‌ అంతా కూడా నీ టీమ్‌లోకి రావడానికి ఇష్టపడలేదు. అది ఎందుకో ఒక్కసారైనా ఆలోచించావా? అని నాగ్‌ సూటిగా అడిగాడు. ఏం చేసినా మేం ముగ్గురమే కలిసి చేస్తున్నామని అందరూ అనుకుంటున్నారని తెలిపాడు నిఖిల్‌. అది నిజమేనా? అని నాగ్‌ అడగ్గా హౌస్‌ అంతా కూడా అవును అని బదులిచ్చింది.

చదవండి: 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement