Bigg Boss 8: నాలుగో స్థానంలో ప్రేరణ ఎలిమినేట్‌ | Bigg Boss Telugu 8 Contestants: Prerana Kambam Entered As 4th Contestant | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: నాలుగో కంటెస్టెంట్‌గా ప్రేరణ

Published Sun, Sep 1 2024 7:46 PM | Last Updated on Sun, Dec 15 2024 9:31 PM

Bigg Boss Telugu 8 Contestants: Prerana Kambam Entered As 4th Contestant

కృష్ణ ముకుంద మురారీ సీరియల్‌తో నటి ప్రేరణ కంభం ఎక్కువ పాపులర్‌ అయింది. ఇందులో అమాయకంగా కనిపించే ప్రేరణ క్యూట్‌ యాక్టింగ్‌ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. ఈ ధారావాహికలో కృష్ణగా ప్రేరణ, ముకుందగా యష్మి గౌడ నటించారు. సీరియల్‌లో మురారి కోసం కొట్టుకున్నట్లే బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌లో వీరిద్దరు టైటిల్‌ కోసం పోటీపడటం ఖాయంగా కనిపిస్తోంది. 

బయట అన్నిరకాల స్పోర్ట్స్‌ ఆడతానంటున్న ఈ బ్యూటీ బిగ్‌బాస్‌లో ఏం గేమ్‌ ఆడుతుందో చూడాలి. అలాగే తన గురించి తనకేం బాధ లేదని, కానీ, తనతో పోటీపడే కంటెస్టెంట్ల పరిస్థితి ఎలాగోనంటూ బాధపడుతోంది ప్రేరణ. రష్మిక మందన్నాకు ఈమె క్లోజ్‌ ఫ్రెండ్‌ కూడా! పెళ్లయి ఎనిమిది నెలలే అవుతున్న ఈ బ్యూటీ భర్తను వదిలేసి బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌లో నాలుగో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఈ చలాకీ బ్యూటీ ఈ సీజన్‌లో ఫైనల్స్‌లో అడుగుపెట్టిన ఏకైక మహిళగా నిలిచింది. అయితే నాలుగో స్థానంలో ఉండగానే ఎలిమినేట్‌ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement