గ్రూప్‌ గేమ్‌ బండారం బయటపెట్టిన బాషా.. నిఖిల్‌కు పెద్ద మైనస్‌ | Bigg Boss Telugu 8 Promo: Shekar Basha Nominates Prerana, Yashmi Gowda | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: నిఖిల్‌ను నామినేట్‌ చేస్తే నీకేంటి? మీదంతా గ్రూప్‌ గేమ్‌.. కడిగిపారేసిన బాషా

Published Mon, Nov 18 2024 6:39 PM | Last Updated on Mon, Nov 18 2024 7:00 PM

Bigg Boss Telugu 8 Promo: Shekar Basha Nominates Prerana, Yashmi Gowda

నిఖిల్‌ అంటే ఇష్టమని అతడి వెంట తిరిగింది యష్మి. తనకు అలాంటి ఫీలింగ్స్‌ లేవని నిఖిల్‌ క్లియర్‌గా చెప్పకుండా చెప్పీచెప్పినట్లు చెప్పి తప్పించుకున్నాడు. పైగా యష్మి.. గౌతమ్‌ షర్ట్‌ వేసుకున్నప్పుడు అలగడం, వేరే ఎవరితోనైనా డ్యాన్స్‌ వేస్తే కుళ్లుకోవడం, తనను హత్తుకుని ముద్దుపెట్టడం వంటివి చూసినప్పుడు నిఖిల్‌కు కూడా ఆమె అంటే ఇష్టముందేమో అన్న సంకేతాలు కనిపించాయి.

ముసుగులో గుద్దులాట
ఈ ముసుగులో గుద్దులాట దేనికి? అసలు నీ అభిప్రాయమేంటి? అని నిఖిల్‌ను ముఖం పట్టుకుని అడిగేసింది సోనియా. అందుకతడు ఆ మ్యాటర్‌ను ఎప్పుడో కట్‌ చేశానని, యష్మిపై తనకలాంటి ఉద్దేశమే లేదన్నాడు. అయితే యష్మి మాత్రం అది అబద్ధమని, తనకు ఏదీ క్లారిటీగా చెప్పలేదని వాదించింది. దీంతో నిఖిల్‌కు ఈ ఎపిసోడ్‌ కొంత మైనస్‌గా మారేట్లు కనిపిస్తోంది.

పురుగుల్ని చూసినట్లు చూస్తావు
ఇక బేబక్క.. మనుషుల్ని చాలా తక్కువ చేసి చూస్తుంటావంటూ పృథ్వీని నామినేట్‌ చేశాడు. ఆర్జే శేఖర్‌ బాషా.. ప్రేరణను నామినేట్‌ చేస్తూ అదిరిపోయే పాయింట్లు చెప్పాడు. అవతలివారిని కించపరిచేట్లుగా మాట్లాడతావ్‌.. కొన్నిసార్లు కొందర్ని పురుగుల్ని చూసినట్లు చూస్తావు.. పానీపట్టు టాస్క్‌లో నిఖిల్‌ నిన్ను, యష్మిని రఫ్‌గా హ్యాండిల్‌ చేశాడు. ఆ పాయింట్‌తో నువ్వు నిఖిల్‌ను నామినేట్‌ చేయొచ్చు. కానీ అది వదిలేసి నీ టీమ్‌ మెంబర్‌ అయిన గౌతమ్‌ను ఎందుకు నామినేట్‌ చేశావు? అని ప్రశ్నించాడు.

నిఖిల్‌కు లేని బాధ నీకెందుకు?
అటు యష్మిని సైతం నామినేట్‌ చేస్తూ.. అవినాష్‌.. రోహిణిని సేవ్‌ చేసి నిఖిల్‌ను నామినేట్‌ చేశాడు. అక్కడ నిఖిలే లైట్‌ తీసుకున్నాడు, కానీ నువ్వెందుకు బాధపడ్డావు? మీ ముగ్గురూ కలిసి గ్రూప్‌ గేమ్‌ ఆడుతున్నారని జనాలకు తెలిసిపోయింది అంటూ యష్మిని నామినేట్‌ చేశాడు.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement