గ్రూప్ గేమ్ ఆడినోళ్లను మడతెట్టేశారు.. గౌతమ్‌పై ప్రేరణ కుళ్లు
బిగ్‌బాస్ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చి వారితో నామినేషన్స్ వేయించాడు. వచ్చిన ప్రతిఒక్కరూ నిఖిల్ గ్యాంగ్పైనే విరుచుకుపడ్డారు. మరి ఎవరు ఎవరెవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే నేటి (నవంబర్ 18) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..గౌతమ్‌పై ప్రేరణ కుళ్లుగత వారం అవినాష్, తేజ డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే వీరికి బదులు గౌతమ్ ఉండాల్సిందని ప్రేరణ అభిప్రాయపడింది. వచ్చినవారమే గౌతమ్ ఎలిమినేట్ అవ్వాల్సింది.. ఇప్పుడు ఏకంగా స్ట్రాంగ్ ప్లేయర్ అయి కూర్చున్నాడు. అదెలాగో నాకర్థం కావట్లేదు. ఈ వారం గౌతమ్, విష్ణుప్రియ, యష్మిలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారనుకున్నాను. అంతా రివర్స్‌లో జరుగుతోంది అని నబీల్‌తో ముచ్చట్లు పెట్టింది.వచ్చావా అక్క..తర్వాత బిగ్‌బాస్ ఆసక్తికర ఘట్టానికి తెరదీశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి ఇద్దర్ని నామినేట్ చేస్తారన్నాడు. మొదటగా సోనియా.. ప్రేరణను నామినేట్ చేసింది. వచ్చావా అక్క అని ప్రేరణ అనడంతో గొడవ పీక్స్‌కు వెళ్లింది. నాకు అక్క కాదు, నిఖిల్‌కు అక్కవి అని ప్రేరణ సంజాయిషీ ఇవ్వడంతో సోనియాకు మరింత తిక్క రేగింది. అతడికి అక్కను అని నువ్వెలా డిసైడ్ చేస్తావు? అంటూ గట్టిగా నిలదీసింది. అందుకు బదులుగా దాదాపు మూడునాలుగుసార్లు ప్రేరణతో సారీ చెప్పించుకుంది.తేజది తప్పయినప్పుడు యష్మిది కూడా తప్పేగా?అనంతరం నా పెద్ద కొడుకు నిఖిల్‌ను నామినేట్ చేస్తున్నా అంటూ నైస్‌గా మొదలుపెట్టి వైల్డ్‌గా మారిపోయింది. అప్పట్లో పృథ్వీని చిన్న కారణంతో నామినేట్ చేశావు. ఎప్పుడైనా కరెక్ట్ కారణంతో ఎవర్నైనా నామినేట్ చేశావా? యష్మి, ప్రేరణను ఎందుకు నామినేట్ చేయలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎవిక్షన్ షీల్డ్గేమ్లో తేజ ముందుగా ఎగ్ వేశాడని అతడిని వరస్ట్ కంటెస్టెంట్ అన్నావు.. మరి తేజ ఎగ్ వేసేవరకు ఆగి కావాలని యష్మి మరో గుడ్డు వేసింది. ఆమె చేసింది తప్పని ఎందుకు ఒప్పుకోవట్లేదు అని నిలదీసింది.ఆమె ముందు మాట్లాడు.. నిఖిల్‌కు సలహాఅతడి లవ్‌ట్రాక్ గురించి మాట్లాడుతూ.. యష్మి నీపై ఫీలింగ్స్ చూపించింది.. ఒక మహిళకు గౌరవమిచ్చేవాడివే అయితే.. ఆమె రిలేషన్షిప్ కోసం హౌస్‌కు రాలేదు, ఆమె ఏం చేస్తే అది పడటానికి రాలేదు అని తన వెనకాల మాట్లాడాల్సిన అవసరం లేదు. అవన్నీ తన ముందే చెప్పాలని గద్దించింది. తన మీద ఇష్టం లేనప్పుడు ఆమె జోలికి వెళ్లకూడదు అని తేల్చేసింది.ఏడ్చేసిన యష్మిసోనియా మాటలతో యష్మి కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు క్లారిటీగా చెప్పుంటే నీ జోలికే వచ్చేదాన్ని కాదని నిఖిల్‌పై మండిపడింది. నిఖిల్‌తో ఒక కలగన్నానే తప్ప తనపై నాకు పెద్ద ఫీలింగ్సే లేవని ప్లేటు తిప్పేసింది యష్మి. చివరగా సోనియా.. నువ్వు నీలా ఉండు నిఖిల్, నువ్వు గెలిస్తే సంతోషపడే మొదటి వ్యక్తిని నేనే అంటూ అతడి తలపై గాజు బాటిల్ పగలగొట్టింది.బేబక్కపై సెటైర్లుతర్వాత బేబక్క హౌస్‌లోకి వచ్చి అవతలివాళ్లను తక్కువ చేయడం నచ్చలేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది. దీంతో అతడు.. ప్రేక్షకులు మాకు ఓట్లు వేసి ఇక్కడిదాకా ఉంచారు. మీకు ఓట్లు వేయకుండా ఎలిమినేట్ చేశారంటూ సెటైర్లు వేశాడు. చీఫ్‌గా ఉన్నప్పుడు తనకు సపోర్ట్ చేయలేదంటూ బేబక్క.. నిఖిల్‌ను నామినేట్ చేసింది.గ్రూప్ గేమ్ మానేస్తే బెటర్అనంతరం శేఖర్ బాషా హౌస్‌లో అడుగుపెట్టాడు. ప్రేరణలో చిన్నపిల్లల మనస్తత్వం ఎంతో నచ్చేవి. కానీ రానురానూ రూడ్‌గా మారిపోయింది.. కొందర్ని పురుగుల్ని చూసినట్లు చూస్తోందంటూ ఆమెను నామినేట్ చేశాడు. గ్రూప్ గేమ్ మానేస్తే బెటర్ అని సలహా ఇచ్చాడు. యష్మిని సైతం గ్రూపిజం కనిపిస్తోందంటూ నామినేట్ చేశాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి