
బెజవాడ బేబక్క పేరు మధు నెక్కంటి. తను సింగిల్‌గా ఉంటోంది. గతంలో పెళ్లి చేసుకుంది, కానీ ఆ వైవాహిక బంధం ఎంతోకాలం నిలవలేదు. తనకంటూ ఓ క్రేజ్ ఉండాలన్న కసితో సోషల్ మీడియాలో ఫన్నీగా వీడియోలు ట్రై చేసింది. అవి జనాలకు ఎంతో నచ్చేయడంతో బెజవాడ బేబక్కగా ఫేమస్ అయింది.
ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ బిగ్‌బాస్ 8లో ఏడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. స్టేజీపై నాగ్‌కు హార్ట్ సింబల్ ఇస్తూ దానిపై మీరే నా బంగార్రాజు అని రాసి తెగ సిగ్గుపడిపోయింది. నాగార్జున కళ్లలో చూస్తే ఎక్కడ కొట్టుకుపోతానోనన్న భయంతో డైరెక్ట్‌గా చూడలేకపోతున్నానంటూ తల వంచుకునే మాట్లాడింది. స్టేజీపైనే ఈ రేంజ్‌లో కామెడీ చేసిన బేబక్క బిగ్‌బాస్ షోలో ఎంత నవ్విస్తుందో అనుకున్నారు. అయితే ఆమె తొలివారం హౌస్ నుంచి బయటకు వచ్చి అందరికి షాకిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment