ప్రేరణ నుంచి హౌస్‌మేట్స్‌కు విముక్తి.. కొత్త చీఫ్‌ ఎవరంటే? | Bigg Boss Telugu 8: Mukku Avinash is New Mega Chief for 11th Week | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: చుక్కలు చూపించిన ప్రేరణ.. ఈసారి కొత్త చీఫ్‌ ఎవరంటే?

Published Fri, Nov 15 2024 7:34 PM | Last Updated on Fri, Nov 15 2024 7:53 PM

Bigg Boss Telugu 8: Mukku Avinash is New Mega Chief for 11th Week

ఏంటో.. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎవరి గ్రాఫ్‌ ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరూ ఊహించలేరు. వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్‌ అదే వారం బ్యాగు సర్దుకుని వెళ్లాల్సింది. కానీ ఇప్పుడేకంగా విన్నర్‌ రేసులో నిలబడ్డాడు. వార్‌ వన్‌ సైడ్‌ అయింది, నిఖిల్‌ ట్రోఫీ ఎత్తడం ఖాయమనుకుంటే అతడికే పోటీ ఇస్తున్నాడు.

అంతా తలకిందులు
విష్ణుప్రియ.. పృథ్వీపైనే కోపం తెచ్చుకుని రెబల్‌గా మారిందనుకునేలోపే అతడిని కన్నందుకు థాంక్యూ అంటూ ఏకంగా పృథ్వీ తల్లి కాళ్లపై పడింది. ఎంతో కూల్‌గా ఉండే తేజ ఈమధ్య ఆవేశం స్టార్‌గా మారిపోయాడు. చాలామందికంటే ప్రేరణ నయం అనుకునేలోపే ఆమె తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. 

చీఫ్‌ అయ్యాక చీప్‌గా..
అందరి మీదా నోరు పారేసుకుని విపరీతమైన నెగెటివిటీ సంపాదించుకుంది. మెగా చీఫ్‌ అవ్వాలని ఫస్ట్‌ వీక్‌ నుంచి ఆశపడింది. ఎట్టకేలకు పదోవారంలో చీఫ్‌ అయింది.. కానీ చీప్‌ బిహేవియర్‌తో తన గ్రాఫ్‌ పాతాళానికి పడిపోయింది. ఆమె.. విష్ణుప్రియ, గౌతమ్‌లను టార్గెట్‌ చేయడం జనాలకు అస్సలు మింగుడుపడలేదు. చీఫ్‌ అయ్యాక తన ఒరిజినల్‌ క్యారెక్టర్‌ బయటపడుతుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. 

కొత్త చీఫ్‌గా అవినాష్‌
మొత్తానికి హౌస్‌లో ఆమె చీఫ్‌ పదవి ముగిసినట్లు తెలుస్తోంది. ఈసారి అందరూ చీఫ్‌ పదవి కోసం పోటీపడగా ముక్కు అవినాష్‌కే ఆ పోస్టు దక్కినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే.. హౌస్‌మేట్స్‌కు ప్రేరణ నుంచి విముక్తి లభించినట్లేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement