హౌస్‌లో నామినేషన్స్‌కు స్వస్తి పలికారు. బిగ్‌బాసే స్వయంగా అందర్నీ(ఫైనలిస్ట్ అవినాష్ మినహా) నామినేట్ చేశారు. అంటే ఇకనుంచి ఇంట్లో కొట్లాటలుండవా.. ఈ రెండువారాలు పిక్‌నిక్‌లా ఎంజాయ్ చేస్తారా? అనుకునేరు. ఫినాలేకు ఇంకో రెండురోజులుందనగా కూడా మేము గొడవపడేందుకు రెడీ అన్నట్లుగానే ఉన్నారు కంటెస్టెంట్లు.
ఓట్ అప్పీల్
ఓట్ అప్పీల్ కోసం బిగ్‌బాస్ టాస్కులు ఇస్తున్నాడు. ఇప్పటికే ఓసారి ప్రేరణ గెలిచి ప్రేక్షకుల్ని తనకు ఓటేయమని అభ్యర్థించే ఛాన్స్ గెలిచింది. నేడు మరొకరికి ఛాన్స్ ఇచ్చేందుకు రెండు గేమ్స్ పెట్టనున్నాడు. అందులో మొదటిదే క్రాసింగ్ పాత్స్. ఇందులో నిఖిల్ తన తాళ్లను తనకు సంబంధించిన పోల్‌కు కాకుండా మరో పోల్‌కు పెట్టి బెల్ కొట్టాడు.
నిఖిల్‌ను విజేతగా ప్రకటించిన ప్రేరణ
ఈ తప్పు గురించి అవినాష్ అడుగుతుంటే అదసలు తప్పే కాదని వాదించింది ప్రేరణ. అటు నబీల్ తన తాడును అడ్డదిడ్డంగా కట్టడంతో అతడినసలు లెక్కలోకే తీసుకోలేదు. దీంతో నబీల్ గొడవకు దిగాడు. నా పోల్ సరిగ్గానే ఉంది.. నువ్వే కావాలని నేను చుట్టిన తాడును చెడగొడుతున్నావ్.. అని మండిపడ్డాడు. దీంతో ప్రేరణ ఇమిటేట్ చేయగా.. నన్ను వెక్కిరించకు, ఇది జోక్ కాదంటూ గద్దించాడు. మొత్తానికి ఈ గేమ్‌లో ప్రేరణ గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment