రోహిణి ఎలిమినేట్‌.. తప్పు ఒప్పుకొన్న ప్రేరణ | Bigg Boss Telugu 8: Prerana Kambam Regrets on 11th Week | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: నబీల్‌ను తుత్తర తగ్గించుకోమన్న నాగ్‌.. షోలో డబుల్‌ ఎలిమినేషన్‌

Published Sat, Dec 7 2024 6:48 PM | Last Updated on Sat, Dec 7 2024 6:58 PM

Bigg Boss Telugu 8: Prerana Kambam Regrets on 11th Week

బిగ్‌బాస్‌ 8 ముగింపుకు ముహూర్తం పెట్టేసినట్లు నాగార్జునే స్వయంగా చెప్పాడు. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు ఉండగా ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌తో ఇద్దర్ని పంపించేస్తున్నట్లు తెలిపాడు. ఈ పద్నాలుగు వారాల జర్నీలో మీరు రిగ్రెట్‌ ఫీలైన వారమేంటో చెప్పాలన్నాడు. అందుకు ప్రేరణ పదకొండో వారం అని చెప్పింది. మెగా చీఫ్‌ అయినప్పుడు సాఫ్ట్‌గా ఉండాల్సింది. కానీ బ్యాలెన్స్‌ కోల్పోయానని తప్పు ఒప్పేసుకుంది. 

సంచాలక్‌గా బాగా చేశావా?
నిజమే, అప్పటిదాకా ప్రేరణ గ్రాఫ్‌ రయ్యిమని పైకెళ్లింది. కానీ మెగా చీఫ్‌ అయిన వెంటనే తన డౌన్‌ఫాల్‌ మొదలైంది. ఇక నిన్నటి రంగుపడుద్ది టాస్క్‌లో సంచాలక్‌గా బాగా చేశావని అనుకుంటున్నావా? అని నాగ్‌ ప్రశ్నించగా లేదంటూ నిజం ఒప్పేసుకుంది. మరోవైపు పోల్‌కు సరిగా తాడు చుట్టాల్సిన గేమ్‌లో నబీల్‌ ఇష్టమొచ్చినట్లు తాడును కట్టి తానే గెలిచానని వాదించాడు. అప్పుడు స్వయంగా బిగ్‌బాసే కలగజేసుకుని అది చుట్టడమా? అని కౌంటర్‌ ఇచ్చాడు. 

స్వార్థంగా ఆలోచించా..
ఇప్పుడు నాగ్‌ కూడా సరిగ్గా చుట్టడమేంటో ఏంటో తెలుసా? అంటూ అతడికి క్లాస్‌ పీకాడు. నీ తిత్తర ఎప్పుడు తగ్గుతుంది? అని ప్రశ్నించాడు.ఫైనలిస్ట్‌ అవడం కోసం చెక్‌పై రూ.15 లక్షలు రాశావు, అలాంటప్పుడు దాన్ని ఎందుకు చించేశావని అడిగాడు. కొంచెం సెల్ఫిష్‌గా ఉందామనే రాశా.. కానీ తర్వాత మరీ ఎక్కువ డబ్బు రాసేశాననిపించింది అని తెలిపాడు. 

డబుల్‌ ఎలిమినేషన్‌
సెల్ఫిష్‌గా ఉండి గేమ్‌ సరిగా ఆడకపోతే ఎవరూ గెలవలేరన్నాడు నాగ్‌. అలాగే ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందన్నాడు. ఇప్పటికే శనివారం షూటింగ్‌ పూర్తవగా అందులో రోహిణిని ఎలిమినేట్‌ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇంకో ఎలిమినేషన్‌ ఎవరనేది తెలియాల్సి ఉంది.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement