
బిగ్‌బాస్ ఫైనల్ వీక్‌లో టాప్ 5 కంటెస్టెంట్లు ఆడుతూపాడుతూ గడిపేస్తారు. అలాగే తమ జర్నీ వీడియోలు చూసుకుని మురిసిపోతుంటారు. అయితే సగం వారం అయిపోయాకగానీ ఈ జర్నీ వీడియోలు ప్లాన్ చేయలేదు బిగ్‌బాస్. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లయిన అవినాష్, గౌతమ్‌ల స్పెషల్ జర్నీని నిన్నటి ఎపిసోడ్‌లో చూపించాడు.

పక్షపాతం?
సీజన్ ప్రారంభం నుంచి ఉన్న కంటెస్టెంట్లు ప్రేరణ, నిఖిల్, నబీల్ జర్నీ వీడియోలు ఈరోజు ప్లే చేయనున్నాడు. 70 రోజులు హౌస్‌లో ఉన్న ఇద్దరి కోసం ఒక ఎపిసోడ్ అంతా కేటాయిస్తే వంద రోజులకు పైగా ఉన్న ముగ్గురినీ ఒకే ఎపిసోడ్‌లో సర్దేయడమేంటని నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రేరణగా నిలిచావ్
ఇక తాజా ప్రోమోలో ప్రేరణ భావోద్వేగానికి లోనైంది. పసిపాపలా హౌస్‌లో అడుగుపెట్టావ్.. పెళ్లి దేనికీ అడ్డుకాదని, పెళ్లయిన మహిళలు కూడా ఎంతో సాధించవచ్చని ఎంతోమందికి ప్రేరణగా నిలిచావంటూ బిగ్‌బాస్ పొగడ్తల వర్షం కురిపించాడు. ఇంటి సభ్యుల దృష్టిలో వరస్ట్ మెగా చీఫ్ కానీ నా దృష్టిలో మాత్రం బెస్ట్ మెగా చీఫ్ అని చెప్పడంతో ప్రేరణ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment