విష్ణు చెంప చెళ్లుమనిపిస్తానన్న నిఖిల్‌ తల్లి.. ఎందుకంటే? | Bigg Boss Telugu 8: Nikhil Maliyakkal Mother Criticise Vishnupriya And Prerana, Posts Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

BB8 Nikhil Mother Controversy: విష్ణు, ప్రేరణలను అసహ్యించుకున్న నిఖిల్‌ తల్లి.. ఏకంగా..!

Published Thu, Nov 14 2024 9:01 PM | Last Updated on Fri, Nov 15 2024 11:15 AM

Bigg Boss Telugu 8: Nikhil Maliyakkal Mother Criticise Vishnupriya, Prerana

తెలుగు బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌ విజయవంతంగా పది వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు పదకొండో వారం ఫ్యామిలీ వీక్‌ నడుస్తోంది. నిన్నటి ఎపిసోడ్‌లో నిఖిల్‌ తల్లి, అవినాష్‌ భార్య, యష్మి తండ్రి హౌస్‌లో అడుగుపెట్టారు. అయితే ఏ ఫ్యామిలీ మెంబర్‌ ఇవ్వనన్ని హింట్లు నిఖిల్‌ తల్లి.. తన కొడుక్కి ఇచ్చింది.

నిఖిల్‌ను ఆదేశించిన తల్లి
ఏమాత్రం సంకోచించకుండా చెప్పాలనుకున్నవన్నీ చెప్పేసింది. గౌతమ్‌తో గొడవపెట్టుకోవద్దని, అతడిని నామినేట్‌ చేయొద్దని సూచించింది. యష్మిని కంట్రోల్‌లో పెట్టమంది. ప్రేరణకు బయట నెగెటివిటీ పెరిగిపోతోందని పరోక్షంగా చెప్తూ తనతో దూరంగా ఉండమంది. యష్మి, ప్రేరణ, నిఖిల్‌ అంతా ఒకే గ్రూప్‌.. కానీ ఇక మీదట గ్రూప్‌ గేమ్స్‌ వద్దు, ఒంటరిగా నీ ఆట నువ్వు ఆడు అని నొక్కి చెప్పింది. 

విష్ణుపై ఎందుకంత కోపం?
ఈ క్రమంలో నిఖిల్‌ తల్లి సోషల్‌ మీడియాలో చేసిన పాత పోస్టులు కొన్ని వైరల్‌గా మారాయి. అందులో ఆమె విష్ణుప్రియపై దారుణ కామెంట్లు చేసింది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ ముఖంపై లాగిపెట్టి కొట్టాలనుందని ఓ పోస్ట్‌ పెట్టింది. అందులో విష్ణును డ్రామా క్వీన్‌ అని విమర్శించింది. దీనిపై ఓ వ్యక్తి స్పందిస్తూ.. విష్ణు కనీసం డ్రామా అయినా చేస్తుంది.. మరి నిఖిల్‌ ఏం చేస్తున్నాడు? అని కామెంట్‌ పెట్టాడు.  అందుకామె.. నిఖిల్‌ తన గేమ్‌ ఆడుతున్నాడు.. టాస్కులు గెలుస్తున్నాడు. విష్ణు మాత్రం కేవలం డ్రామానే చేస్తుందని విమర్శించింది. 

ఇతర కంటెస్టెంట్లను తిట్టడమేంటి?
ప్రేరణను వీడియోను షేర్‌ చేస్తూ.. వావ్‌. ఆ కల్చర్‌ ఏంటి? నీ ప్రవర్తన ఏంటి? ఆ లాంగ్వేజ్‌ ఏంటి? అని విమర్శించింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు నెట్టింట ప్రత్యక్షం కావడంతో బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. ఫ్యామిలీ తన కంటెస్టెంట్‌ గురించి పోస్టులు పెట్టాలి కానీ ఇలా ఇతర కంటెస్టెంట్లను తిడుతూ పోస్టులు పెట్టడం తప్పని పలువురూ అభిప్రాయపడుతున్నారు.  

నిఖిల్‌ను తిడుతుంటే ఎలా ఊరుకుంటుంది?
ఓ టాస్కులో ప్రేరణ, విష్ణుప్రియ.. నిఖిల్‌పై నోరుపారేసుకోవడం వల్లే ఆ తల్లి తట్టుకోలేక అలాంటి కామెంట్స్‌ చేసిందని నిఖిల్‌ అభిమానులు ఆమెను వెనకేసుకొస్తున్నారు. నిఖిల్‌ చేతికి గాజులు వేసుకుని బొట్టు పెట్టుకోవాలి అని విష్ణు తిట్టినందుకే అతడి తల్లి ఆమె చెంప పగలగొడతానందని.. అందులో తప్పేముందని కామెంట్లు చేస్తున్నారు.
 

 

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement