టికెట్ టు ఫినాలే గేమ్ తర్వాత హౌస్‌మేట్స్‌లో టెన్షన్ రెట్టింపైంది. ఎలాగైనా ఫైనల్‌లో చోటు దక్కించుకోవాలని అందరూ తాపత్రయపడుతున్నారు. కప్పు కొట్టాల్సిందేనని గట్టిగా ఫీలవుతున్నారు. అయితే బిగ్‌బాస్ 8 ట్రోఫీ ఎత్తగల దమ్మున్న ప్లేయర్ ఎవరు? ఫినాలే వరకు రాకుండా దుమ్ముదుమ్ముగా అయిపోయే కంటెస్టెంట్ ఎవరో చెప్పాలన్నాడు నాగ్.
ట్రోఫీ అందుకు దమ్ము ఎవరికి?
అలా నబీల్.. తన తర్వాత నిఖిల్ గెలిచే ఛాన్స్ ఉందన్నాడు. రోహిణి.. గౌతమ్ గెలుస్తాడని, ఫినాలే వరకు ప్రేరణ రాలేదని అభిప్రాయపడింది. తేజ.. విష్ణు దుమ్ముగా అయిపోతుందన్నాడు. పృథ్వీయేమో తేజ ఫినాలే వరకు రాలేడన్నాడు. అవినాష్.. పృథ్వీ దుమ్ము అని తెలిపాడు. ప్రేరణ మాట్లాడుతూ.. అవసరం లేని చోట కూడా తేజ కంటెంట్ క్రియేట్ చేస్తాడు. అది ప్రేక్షకులు పసిగడితే అతడు ఫినాలేకు రాడు అని చెప్పింది. అన్నట్లుగానే ఈ రోజు తేజ ఎలిమినేట్ కానున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment