ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి లేదా ఎలిమినేషన్‌లో ఉన్నవారిని సేవ్ చేయడానికి బిగ్‌బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ప్రవేశపెడుతుంటాడు. అలా ఈసారి కూడా ఎవిక్షన్ షీల్డ్ తీసుకొచ్చాడు. ఈ షీల్డ్ గెలిచినవారు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా సేవ్ అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే అది ఒక్కవారమా? ఏంటనేది క్లారిటీ లేదు.
ఆటలో ఐదుగుర్ని తీసేసిన మెగా చీఫ్
అయితే ఎవిక్షన్ షీల్డ్‌కు అర్హత లేదనకున్న ఐదుగురురిని గేమ్‌లో నుంచి తీసేయాలని మెగా చీఫ్ ప్రేరణకు బాధ్యత అప్పగించాడు. అలా ప్రేరణ.. పృథ్వీ, గౌతమ్, గంగవ్వ, హరితేజ, విష్ణుప్రియలను సైడ్ చేసేసింది. మిగిలిన హౌస్‌మేట్స్ షీల్డ్ కోసం పోటీపడ్డారు.
ఎవిక్షన్ షీల్డ్
ఈ క్రమంలో నబీల్.. యష్మిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అవినాష్ వివరణ ఇస్తుండగా యష్మి ఒంటికాలిపై లేచింది. ఒకర్ని వీక్ అని చెప్పొద్దు.. స్ట్రాంగ్ ఉన్న ప్లేయర్స్ కూడా చాలా గేమ్స్‌లో ఓడిపోయారు అని పేర్కొంది. ఇకపోతే ఎవిక్షన్ షీల్డ్ చివరకు నబీల్‌ను వరించినట్లు తెలుస్తోంది.
నబీల్‌కు మైనస్?
అయితే ఇది అతడికి ఏరకంగా ప్లస్ అయ్యేట్లు లేదు. నామినేషన్‌లో ఉంటేనే జనాలు ఓట్లు గుద్దుతూ అతడికి అండగా ఉంటారు. ఇలా నామినేషన్స్‌లో లేకుండా ఉంటే అతడికి ఓట్లు వేసేవారందరూ మిగతా హౌస్‌మేట్స్‌కు ఓట్లు వేసే ఆస్కారం ఉంది. అలా తన ఓట్ బ్యాంక్ పడిపోయే ఆస్కారం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment