బిగ్‌బాస్ 8లో రోజులు మారుతున్నకొద్దీ హౌస్‌మేట్స్ మధ్య గొడవలు పెరుగుతున్నాయి. మంగళవారం ఎపిసోడ్ సందర్భంగా రేషన్ కోసం మూడు గేమ్స్ పెట్టారు. సంచాలక్స్ వ్యవహరించిన మణికంఠపై ప్రేరణ, సోనియాపై యష్మిపై తెగ అరిచేశారు. ఇదలా ఉండగానే ఇప్పుడు మరో కొత్త రచ్చ మొదలైంది. ఫుడ్ విషయంల ప్రేరణ ప్రవర్తన వల్ల విష్ణుప్రియ కన్నీళ్లు పెట్టుకుంది. తాజా ప్రోమోలో ఇదే తంతు.
(ఇదీ చదవండి: Bigg Boss 8: టాస్క్‌ల్లో ముద్దుల గోల.. తప్పు చేసిన మణికంఠ?)
16 రోజులు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ 8 నుంచి బేబక్క, శేఖర్ భాషా ఎలిమినేట్ అయిపోయారు. ఈ వారం ఇప్పటికే నామినేషన్స్ పూర్తి కాగా 8 మంది లిస్టులో ఉన్నారు. వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది తెలియట్లేదు. మరోవైపు ప్రేరణ తనకు ఫుడ్ ప్లేట్‌లో వడ్డించకుండా, విసిరేస్తుందని విష్ణుప్రియ బాధపడింది. మిగతా వాళ్లు వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే కన్నీళ్లు పెట్టుకుంది.
ఈ గొడవ మధ్యలో దూరిన మణికంఠ.. ప్రేరణకి యాటిట్యూడ్ తగ్గించుకోమని ఏదో చెప్పబోయాడు. కానీ ఏమైనా చేసుకో పో అని ప్రేరణ అనడాన్ని ప్రోమోలో చూపించారు. అంటే బుధవారం ఎపిసోడ్‌లో ఈ గొడవని ఎక్కువ హైలైట్ చేసేలా ఉన్నారు. ఈ వారం గేమ్స్‌తో పాటే ఏడుపులు, అరుపులు ఎక్కువగానే ఉన్నట్లు లేటెస్ట్ ప్రోమోలు చూస్తుంటే అర్థమవుతోంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 మూడో వారం ఓటింగ్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు?)
Comments
Please login to add a commentAdd a comment