
బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పుడిప్పుడే టాస్కులు షురూ అవుతున్నాయి. ఇక్కడ అంతా ఉల్టా పల్టా అని ముందునుంచీ బిగ్‌బాస్ భయపెడుతూ ఉంటే దేనికైనా రెడీ అని హౌస్‌మేట్స్ తెగించి ఉన్నారు. ఓ పక్క టాస్కుల్లో ఉత్తేజంగా ఆడుతూనే మరోపక్క తోటి కంటెస్టెంట్లతో బంధాలు ఏర్పరుచుకుంటున్నారు. ఈ విషయంలో అందరికంటే యమ జోరుగా ఉన్నాడు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. హౌస్‌లోకి వచ్చిన రెండు రోజుల్లోనే హీరోయిన్ రతిక రోస్‌ను బుట్టలో పడేశాడు. తన మనసే ఇచ్చేస్తానని రతిక అనడంతో ప్రశాంత్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు.
తాజాగా టేస్టీ తేజ కూడా ఇలాంటిది తనకేమైనా వర్కవుట్ అవుతుందేమోనని ప్లాన్ చేశాడు. శుభశ్రీ రాయగురు తేజను అమ్మాయిలా రెడీ చేసేందుకు రెడీ అయింది. అతడి ముఖానికి మేకప్ అద్ది, పిలకజుట్టు వేసింది. అనంతరం లిప్‌స్టిక్ పూస్తుండగా డైరెక్ట్‌గా పెదాలతో లిప్‌స్టిక్ వేయొచ్చుగా అని అడిగాడు. తేజ మాటలు విని షాకైన శుభశ్రీ.. అలాంటి పప్పులు ఉడకవంటూ అతడి చెంపపై లిప్‌స్టిక్ రుద్దింది.
అయినా సరే తేజ పట్టువిడవకుండా తనకు డైరెక్ట్‌గా లిప్‌స్టిక్ కావాలని గోల చేశాడు. దీంతో అక్కడే ఉన్న షకీలా.. ఓస్ అంతేనా.. అని అతడి బుగ్గన ముద్దు పెట్టింది. అలా అతడి బుగ్గపై షకీలా లిప్‌స్టిక్ మరకలు పడ్డాయి. దీంతో అక్కడున్నవారంతా నవ్వారు. అయితే తేజ తనకు దేవుడిచ్చిన కొడుకు అని చెప్పుకొచ్చింది షకీల.
చదవండి: బిగ్‌బాస్: కండబలం కంటే బుద్ధిబలం గ్రేట్ అని నిరూపించారు!
Comments
Please login to add a commentAdd a comment