బిగ్‌బాస్‌ 7: ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్‌! | Bigg Boss Telugu 7: Shakeela Out From BB House | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ ఆటలో ఓడిపోయిన కంటెస్టెంట్‌.. ఎలిమినేట్‌ అయ్యేది తనే!

Published Sat, Sep 16 2023 3:45 PM | Last Updated on Sat, Sep 16 2023 4:43 PM

Bigg Boss Telugu 7: Shakeela Out From BB House - Sakshi

బిగ్‌బాస్‌ రియాలిటీ షో రసవత్తరంగా మారుతోంది. ఎవరికి వారు తగ్గేదేలే అన్న రేంజ్‌లో యాక్టింగ్‌ చేస్తున్నారు. కొందరు నిజాయితీగా ఆడుతుంటే మరికొందరు పక్కవాళ్లను తొక్కేయాలనే ఆలోచిస్తున్నారు. ఆడటం చేతకానివాళ్లు ఫుటేజీ కోసం ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి ఎవరి టాలెంట్‌ వారు చూపిస్తున్నారు.

ఈ షో ఫస్ట్‌ వీక్‌లో తెలుగు రాని కిరణ్‌ రాథోడ్‌ ఎలిమినేట్‌ అయింది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ప్రస్తుతం శివాజీ, పల్లవి ప్రశాంత్‌, రతిక, తేజ, అమర్ దీప్, షకీలా, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి, ప్రిన్స్‌ యావర్‌ నామినేషన్స్‌లో ఉన్నారు. తెలుగు రాని ప్రిన్స్‌ ఎలిమినేట్‌ కావచ్చని అంతా అనుకున్నారు. కానీ తన ఆటతో చెలరేగిపోయి ఆటగాడినే అని నిరూపించుకున్నాడు. దీంతో అతడు ఎలిమినేట్‌ అయ్యేట్లు కనిపించడం లేదు. మిగిలినవారిలో షకీలా, తేజకు తక్కువ ఓట్లు వచ్చినట్లు కనిపిస్తోంది.

తేజ అంతో ఇంతో కామెడీ చేస్తున్నాడు, కానీ షకీలా పెద్దగా పర్ఫామెన్స్‌ చేసిందే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో షకీలాను ఎలిమినేట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే శృంగార తారగా ముద్ర పడ్డ షకీలా.. బిగ్‌బాస్‌ హౌస్‌కు వచ్చి తాను కూడా అందరిలాంటే సాధారణ మహిళే అని నిరూపించింది. సినిమాల్లో గ్లామర్‌ పాత్రలు చేసినప్పటికీ నిజ జీవితంలో మాత్రం సింపుల్‌గా ఉండటానికే ఇష్టపడతానని తన వేషధారణతో చెప్పకనే చెప్పింది. ఎటువంటి గొడవలకు పోకుండా, మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడింది. నిజాయితీగా గేమ్‌ ఆడిందే తప్ప కంటెంట్‌ ఇవ్వాలని ఎక్కడా అతి చేయలేదు. ఈ షోకి వచ్చి షకీలా అమ్మగా పేరు తెచ్చుకుంది.

చదవండి: గర్భం దాల్చాను.. అమ్మ అబార్షన్‌ చేయించింది.. ప్రియుడితో ఇప్పటికీ టచ్‌లో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement