అందుకే అడల్ట్‌ సినిమాలు చేశా, ఎలాగో డబ్బులు కూడా బాగా వచ్చేవి.. | Bigg Boss 7 Telugu: Teja Asks Shakeela Why Did You do Adult Films | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: అడల్ట్‌ సినిమాలు చేస్తే తప్పేంటి? టేస్టీ తేజకు షకీలా కౌంటర్‌

Sep 6 2023 10:50 AM | Updated on Sep 8 2023 9:32 AM

Bigg Boss 7 Telugu: Teja Asks Shakeela Why Did You do Adult Films - Sakshi

అప్పట్లో నాకు అడల్ట్‌ సినిమా ఆఫర్లే వచ్చాయి. అంతకుముందు చిన్నచిన్న గ్లామర్‌ చిత్రాలు చేశాను. నిక్కర్లు వేసుకుని గ్లామర్‌గా డ్యాన్సులు చేసినప్పుడు లేని తప్పు.. అలాంటి సినిమాల్లో చేస్తే తప్పేంటనిపించింది అని బదులిచ్చింది. అలాంటి సినిమాలు ఎన్ని చేశారని అడగ్గా.. 500కు పైగా చేశానంది షకీలా. మరి మీ ఇంట్లో ఏమీ అనలేదా?

ఇంద్రధనస్సులో ఏడు రంగులు.. బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు.. అన్నట్లుగా బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లోనూ ఎన్నో వింతలు- విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు 20 మంది కంటెస్టెంట్లతో కళకళలాడే హౌస్‌లో ఈసారి కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు. పోనీ వారికి సకల సౌకర్యాలు కల్పించారా? అంటే.. అదీ లేదు! 14 మందికి సరిపడా బెడ్స్‌ ఇవ్వకపోవడంతో కొందరు కంటెస్టెంట్లు రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి. ఈ బెడ్స్‌ సంపాదించుకోవడానికి ఏదో టాస్క్‌ పెట్టేట్లు ఉన్నాడు బిగ్‌బాస్‌.

అందరితో కలిసిపోయిన టేస్టీ తేజ
అదేదో ఈపాటికే చేసి ఉంటే కంటెస్టెంట్లకు కొంత ఉపశమనం లభించేది, కంటి నిండా నిద్రపోయే భాగ్యం దక్కేది. ఇకపోతే ఈ వారం శోభా శెట్టి, రతిక, ప్రిన్స్‌ యావర్‌, ప్రశాంత్, కిరణ్‌ రాథోడ్‌, గౌతమ్, షకీలా, దామిని నామినేషన్స్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే హౌస్‌లో టేస్టీ తేజ సరదాగా మాట్లాడుతూ అందరితో కలిసిపోయాడు. అలాగే అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడి మాటలు అక్కడ చెప్తూ గొడవలు కూడా పెట్టేస్తున్నాడు. యూట్యూబ్‌లో సెలబ్రిటీలతో భోజనాలు చేస్తూ ఇంటర్వ్యూ చేసే అతడు తాజాగా హౌస్‌లో షకీలాను సైతం ఇంటర్వ్యూ చేసి తన మనసులో సందేహాలను తీర్చేసుకున్నాడు. అసలు మీరెందుకు అలాంటి సినిమాలే చేశారు? అని అడిగాడు.

500కు పైగా సినిమాలు
దీనికి షకీలా స్పందిస్తూ.. ఆ సమయంలో నాకు వచ్చిన అవకాశాలు చేసుకుంటూ పోయాను. అప్పట్లో నాకు అడల్ట్‌ సినిమా ఆఫర్లే వచ్చాయి. అంతకుముందు చిన్నచిన్న గ్లామర్‌ చిత్రాలు చేశాను. నిక్కర్లు వేసుకుని గ్లామర్‌గా డ్యాన్సులు చేసినప్పుడు లేని తప్పు.. అలాంటి సినిమాల్లో చేస్తే తప్పేంటనిపించింది అని బదులిచ్చింది. అలాంటి సినిమాలు ఎన్ని చేశారని అడగ్గా.. 500కు పైగా చేశానంది షకీలా. మరి మీ ఇంట్లో ఏమీ అనలేదా? అని అడగ్గా.. డబ్బులు బాగా వచ్చేవి కదా.. అందుకే ఏమీ అనలేదు. అయినా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావేంటి? అని అడిగేసరికి తేజ తన ప్రశ్నల పరంపరకు చెక్‌ పెట్టాడు.

ట్రాన్స్‌జెండర్లే తన పిల్లలు
అయితే తన సొంత సోదరే తన దగ్గరున్న డబ్బంతా తీసుకుని మోసం చేసిందని బిగ్‌బాస్‌ షో లాంచ్‌ రోజే తన ఏవీలో చెప్పుకుని బాధపడింది షకీల. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయిన ఆమె ట్రాన్స్‌జెండర్లను దత్తత తీసుకుని వారి బాగోగులు చూసుకుంటోంది. 2014లో కన్నడ బిగ్‌బాస్‌ షోలోనూ పాల్గొంది. కానీ నెల రోజులు తిరగకముందే ఎలిమినేట్‌ అయింది.

చదవండి: అదితి శంకర్‌ రచ్చ.. నెక్స్ట్‌ టార్గెట్‌ విజయ్‌? అంటూ కామెంట్స్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement