'బిగ్‌బాస్ 7'లో తొలిరోజే గొడవ? నామినేషన్లలో ఉన్నది వీళ్లే! | Bigg Boss 7 Telugu Day 1 Episode Highlights - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Day 1 Highlights: ప్రశాంత్-రతిక లవ్ ట్రాక్? పుల్ల పెట్టేసిన టేస్టీ తేజ!

Published Mon, Sep 4 2023 11:03 PM | Last Updated on Wed, Sep 6 2023 10:38 AM

Bigg Boss 7 Telugu Day 1 Episode Highlights - Sakshi

'బిగ్‌బాస్ 7' అసలు గేమ్ మొదలైంది. 14 మంది కంటెస్టెంట్స్‌ని ఆదివారం లోపలికి పంపించిన నాగార్జున.. హౌస్‌కి లాక్ వేసేశాడు. అలా ఆదివారం ఎపిసోడ్‌కి ఎండ్ పడింది. ఇకపోతే సోమవారం నామినేషన్స్ షురూ అయ్యాయి. హౌసులో ఫస్ట్ లవ్ ట్రాక్ కూడా మొదలైపోయింది. టేస్టీ తేజ అప్పుడే ఇద్దరి మధ్య పుల్ల పెట్టేశాడు. వీటితో పాటు తొలిరోజు ఇంకా ఏమేం జరిగాయనేది.. ఇప్పుడు Day-1 హైలైట్స్‌లో డీటైల్‌గా చూద్దాం.

టాస్క్ ఇచ్చిన పొలిశెట్టి
మూవీ ప్రమోషన్‌లో భాగంగా హౌసులోకి వెళ్లిన హీరో నవీన్ పొలిశెట్టిని సీక్రెట్ రూంలో పెట్టి బిగ్‌బాస్ లాక్ చేశాడు. హౌసులోని అమ్మాయిలందరూ కలిసి అతడిని బయటకు తీసుకొచ్చారు. అందరూ తమని తాము పరిచయం చేసుకున్నారు. అనంతరం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాలోని 'లేడీ లక్' పాటని గుర్తు చేసిన నవీన్.. హౌసులో అబ్బాయిలు, అమ్మాయిల్లో నచ్చినవాళ్లకు బ్యాండ్ కట్టాలని టాస్క్ ఇచ్చాడు.

బ్యాండ్ కట్టేశారు
దీంతో ఆట సందీప్-ప్రియాంక జైన్‌కు, గౌతమ్ కృష్ణ- దామినికి, అమరదీప్ - శోభాశెట్టికి, పల్లవి ప్రశాంత్- రతికకి, శివాజీ-శుభశ్రీకి, ప్రిన్స్ యవర్ - కిరణ్ రాథోడ్‌కి, టేస్టీ తేజ- షకీలాకి బ్యాండ్ కట్టారు. ఆ తర్వాత లేడీ లక్ పాటకు అందరితో కలిసి డ్యాన్స్ చేసిన నవీన్.. హౌసు నుంచి బయటకొచ్చేశాడు. నాగ్ ఇచ్చిన సంకెళ్ల టాస్కులో భాగంగా గౌతమ్ కృష్ణ.. తన చేతికి ఉన్న హ్యాండ్ కఫ్‌ని శుభశ్రీకి వేశాడు. కాసేపటి తర్వాత అందరితో మాట్లాడిన బిగ్‌బాస్.. హౌసులో ఎన్నో కొత్త విషయాలు, ఆశ్చర్యపరిచేవి ఎన్నో రెడీగా ఉన్నాయని చెప్పారు. హౌసులో ఉన్నంత మాత్రాన హౌజ్‌మేట్స్ అయినట్లు కాదని క్లారిటీ ఇచ్చాడు. 

పులిహోర షురూ
బిగ్ బాస్ అంటేనే పులిహోర కంపల్సరీ. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్, రతికకు బ్యాండ్ కట్టాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య మాటలు కలిశాయి. ఈ క్రమంలోనే అసలు బిగ్ బాస్ హౌసులోకి ఎందుకు రావాలనుకున్నావ్ అని ప్రశాంత్‌ని రతిక అడిగింది. 'ఫస్ట్ టైమ్ బిగ్‌బాస్ లోకి రావాలని అనిపించి ఓ వీడియో పెట్టాను. కానీ అందరూ తిట్టడంతో డిలీట్ చేశాను. అప్పుడే షోలోకి ఎలాగైనా రావాలని ఫిక్స్ అయ్యాను' అని ప్రశాంత్, రతికతో చెప్పాడు.

శోభాశెట్టి ఏడుపు
రాత్రి ఒంటి గంటకు లైట్ ఆపు చేయడంతో అందరూ నిద్రపోవడానికి రెడీ అయ్యారు. కానీ మంచిగా పడుకోవడానికి రెడీ అవుతున్న సందీప్, శివాజీ, పల్లవి ప్రశాంత్‌ని.. రతిక, టాస్క్ పేరు చెప్పి భయపెట్టింది. దీంతో వాళ్లు నిద్రపోలేదు. మిగిలిన వాళ్లందరికీ బెడ్స్ లేకపోవడంతో కిచెన్‌లో మాట్లాడుతూ టైమ్ పాస్ చేశారు. మరోవైపు శోభాశెట్టి ఏడుపు మొదలుపెట్టేసింది. 'వీక్ అవ్వకూడదు.. వీక్ అవ్వకూడదు బీ స్ట్రాంగ్' అని తనకు తానే చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది.

రతిక టాస్క్ తిప్పలు
సోమవారం ఉదయం 10:15 గంటలకు కంటెస్టెంట్స్ అందరూ నిద్రలేచారు. 'భోళా శంకర్'లోని జాం జాం జజ్జనక పాటకు స్టెప్పులేసి బిగ్ బాస్‌కి గుడ్ మార్నింగ్ చెప్పారు. ఆ తర్వాత శివాజీకి పెళ్లయిందా? లేదా? అనే టాపిక్ పైన డిస్కషన్ పెట్టారు. తనకు పెళ్లి కాలేదని, బ్యాచిలర్ అని శివాజీ చెప్పాడు. నాగార్జున ఇచ్చిన బ్రోకన్ హార్ట్ టాస్క్ పూర్తి చేసేందుకు రతిక తిప్పలు పడింది. అమరదీప్-ప్రియాంక మధ్య గొడవ పెట్టమని.. శోభాశెట్టికి చెప్పగా ఆమె నో చెప్పింది. గెలిస్తే పర్లేదు లేదంటే తను నామినేట్ అయిపోతాను కదా అని భయపడింది. ఈ టాస్క్ వల్ల నీకు అడ్వాంటేజ్ దక్కుతుంది కదా అని రతికతో శోభాశెట్టి డిస్కషన్ పెట్టింది.

రతికతో పల్లవి ప్రశాంత్
టాస్క్ పూర్తి చేసేందుకు రతిక.. పల్లవి ప్రశాంత్ దగ్గరకు వెళ్లింది. దీంతో 'నీకోసం ఏ రిస్క్ అయినా సరే చేస్తా' అని మనోడు రతికతో అన్నాడు. ఆమె అలా నవ్వుతూ ఉండిపోయింది. మరోవైపు టేస్టీ తేజ-షకీలా మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. అసలు వ్యాంప్ తరహా సినిమాలు ఎందుకు చేశారు? అని షకీలాని టేస్టీ తేజ అడగ్గా.. అలాంటి క్యారెక్టర్స్ వచ్చాయని, అవే ఒప్పుకున్నానని షకీలా సమాధానమిచ్చింది. ఈ క్రమంలోనే షకీలా, కిరణ్ రాథోడ్.. ఇద్దరికీ(వేర్వేరుగా) పెళ్లి కాలేదనే విషయం బయటపడింది.

గొడవకి తేజ రెడీ
టాస్క్ చేయమని.. రతిక టేస్టీ తేజని కూడా బతిమాలాడింది. కానీ అతడు కనీసం పేర్లు కూడా చెప్పొద్దని ఆమెతో అన్నాడు. ఫైనల్‌గా ఒప్పుకున్నాడు. మరోవైపు బ్రోకన్ హార్ట్ ఫస్ట్ తీసుకుంది శోభాశెట్టి. దీంతో ఇది తీసుకున్నందుకు తను కచ్చితంగా నామినేషన్స్‌లో ఉంటానని భయపడిపోయింది.

పుల్లపెట్టిన టేస్టీ తేజ
టేస్టీ తేజ.. ప్రిన్స్ యవర్-గౌతమ్ కృష్ణ మధ్య పుల్ల పెట్టేశాడు. ఉదయం జిమ్ చేసే సమయంలో ఒకరిని ఒకరు ఇమిటేట్ చేసుకోవడం గురించి ప్రిన్స్ చెప్పింది గౌతమ్ దగ్గరికి వెళ్లి చెప్పాడు. కానీ గౌతమ్ మాత్రం ప్రిన్స్‌తో మాట్లాడటానికి నో చెప్పాడు. ఈ క్రమంలోనే ఎవరివైపు నిలబడతావ్ అని గౌతమ్, శుభశ్రీని అడిగాడు. ఆమె.. నీవైపే అని గౌతమ్‌తో చెప్పుకొచ్చింది.

నామినేషన్స్ షురూ
సోమవారం సాయంత్రం 6 గంటలకు తొలివారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. యాక్టివిటీ ఏరియాని నరకంలా డిజైన్ చేశారు. బిగ్ బాస్ కూడా వాయిస్ మార్చి మాట్లాడాడు. యాక్టివిటీ ఏరియాకి వెళ్లి.. అక్కడ వేలాడదీసిన ఫొటొల్లో ఎవరిదైతే చింపి, నరకపు వోల్కనోలో వేస్తారో వాళ్లు నామినేట్ అయినట్లు. మొదటగా వెళ్లిన శివాజీ.. దామిని, గౌతమ్ కృష్ణని నామినేట్ చేశాడు. అయితే అతడు చెప్పిన కారణాలు బిగ్‌బాస్‌కి నచ్చలేదు. అది అయిపోయిన తర్వాత శివాజీ.. దామిని, గౌతమ్ కృష్ణతో మాట్లాడాడు. 

తర్వాత యాక్టివిటీ రూంలోకి వెళ్లిన ప్రియాంక జైన్.. పల్లవి ప్రశాంత్, రతికని నామినేట్ చేసింది. తనతో వాళ్లిద్దరూ పెద్దగా కలవకపోవడం వల్లే నామినేట్ చేశానని కారణం చెప్పింది. దీనికి ప్రశాంత్, రతిక ఇద్దరూ ఒప్పుకోలేదు. సరికదా ఈ విషయమై ప్రియాంకతో యాక్టివిటీ ఏరియా నుంచి బయటకొచ్చిన తర్వాత డిస్కషన్ పెట్టారు. అలా సోమవారం ఎపిసోడ్ ఎండ్ పూర్తయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement