ఎట్టకేలకు బిగ్‌బాస్‌ హౌస్‌లో తేజ తల్లి.. కల నిజమైందోచ్‌! | Bigg Boss Telugu 8 Promo: Tasty Teja Mother Enters Into House | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: తేజ కన్నీళ్లు వృథా కాలేదు.. బిగ్‌బాస్‌ కరుణించాడు!

Nov 15 2024 4:27 PM | Updated on Nov 15 2024 4:46 PM

Bigg Boss Telugu 8 Promo: Tasty Teja Mother Enters Into House

అందరి అమ్మలు వస్తున్నారు.. ఒక్క మా అమ్మ తప్ప! అని కంటికి మిన్నుగా ఏడుస్తూనే ఉన్నాడు తేజ. అతడి కోసం రోహిణి, గౌతమ్‌ తమ పేరెంట్స్‌ రాకపోయినా పర్లేదు తేజ తల్లిని మాత్రం పంపించండని త్యాగానికి సిద్ధమయ్యారు. అందుకు బిగ్‌బాస్‌ ఒప్పుకోలేదు. 

ప్రేరణకు సర్‌ప్రైజ్‌
హౌస్‌లో అందరి ఫ్యామిలీ మెంబర్స్‌ వచ్చారు. రావట్లేదన్న ప్రేరణ భర్త కూడా నేడు హౌస్‌లో అడుగుపెట్టి సర్‌ప్రైజ్‌ చేశాడు. చిట్టచివరగా తేజకూ ఆ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. అయితే మొదట ఏడిపించాకే తర్వాత సంతోషాన్ని పంచాడు బిగ్‌బాస్‌. అతడి తల్లి హౌస్‌లోకి రాలేకపోతున్నానంటూ ఫోన్‌లో మాట్లాడటంతో మరింత కుమిలిపోయాడు. 

హౌస్‌లో తేజ తల్లి
కానీ కాసేపటికే ఆమె హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. తనను చూడగానే తేజ చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. తల్లిని బిగ్‌బాస్‌ హౌస్‌కు తీసుకురావాలన్న కల ఎట్టకేలకు నెరవేరిందోచ్‌ అంటూ తెగ సంబరపడిపోయాడు. ఈ ఆత్మీయ కలయిక చూసిన నబీల్‌.. ఇప్పుడు ఫ్యామిలీ వీక్‌ సంపూర్ణమైందని పేర్కొన్నాడు.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement